అర్జున్ రెడ్డి డైరెక్టర్ సమస్యేంటీ..?

43
arjun reddy problem
arjun reddy problem

arjun reddy problem

ఓ చిన్న హిట్ ఇచ్చిన దర్శకులే ఇవాళా రేపూ వెంటనే క్రేజీ ఆఫర్స్ అందుకుంటున్నారు. అలాంటిది ఒకే సినిమాతో రెండు భాషల్లో బిగ్గెస్ట్ హిట్స్ అందుకున్న దర్శకుడు మాత్రం మరో సినిమా కోసం ఓ రేంజ్ లో ఎదురుచూస్తున్నాడు. రీసెంట్ గా ఓ బాలీవుడ్ సినిమా చేస్తాడు అనే టాక్ వచ్చినా.. అది ఎంత వరకూ వచ్చిందో ఎవరికీ తెలియదు. కానీ ఈ దర్శకుడిపై మాత్రం రోజుకో రూమర్ వినిపిస్తోంది. అసలు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటీ..? ఎందుకు ఇంత గ్యాప్ వస్తోంది..? సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన అర్జున్ రెడ్డి..  తెలుగులో పాత్ బ్రేకింగ్ అనే పేరు తెచ్చుకుంది. శివ తర్వాత ఆ రేంజ్ లో యూత్ లో సంచనలమైన సినిమా ఇది. అర్జున్ రెడ్డితో నటుడు విజయ్ దేవరకొండ స్టార్ అయిపోయాడు. కానీ ఆ స్టార్డమ్ దర్శకుడికి రాలేదు. ముఖ్యంగా ఇది దర్శకుడి విజన్ నుంచి వచ్చిన కథే. కానీ హీరోకు వచ్చినంత ఫేమ్ కానీ ఆఫర్స్ కానీ దర్శకుడు అందుకోలేకపోయాడు. కానీ కొంత గ్యాప్ వచ్చినా ఇదే చిత్రాన్ని బాలీవుడ్ లో కబీర్ సింగ్ అంటూ రీమేక్ చేశాడు. ఏ మాత్రం మార్పులు చేర్పులు లేకుండా అక్కడ రూపొందించిన ఈ మూవీ బాలీవుడ్ లో సైతం బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ఏకంగా మూడు వందల కోట్లు కొల్లగొట్టింది. అలాగే కబీర్ సింగ్ తో షాహిద్ కపూర్, కియారా అద్వానీ రేంజ్ కూడా మారింది అక్కడ. ఒకే సినిమాతో అదే దర్శకుడు రెండు భాషల్లో ఒకే తరహా విజయాన్ని నమోదు చేయడం విశేషంగానే చెప్పాలి. అయితే తన సినిమా ఆర్టిస్టులకు ప్లస్ అవుతోంది కానీ అతని కావడం లేదని మరోసారి ప్రూవ్ అయింది. మామూలుగా ఇంత పెద్ద హిట్ ఇచ్చిన దర్శకులను ఏ పరిశ్రమా ఖాళీగా ఉంచదు. కానీ బాలీవుడ్ లో సందీప్ రెడ్డి కోసం బాలీవుడ్ లో ఏ పెద్ద నిర్మాతా ముందుకు రాలేదు. చివరికి కబీర్ కపూర్ నిర్మాతలే అతని కథను నమ్మి ముందుకు వచ్చారన్నారు. డెవిల్ అనే టైటిల్ తో ఓ గ్యాంగ్ స్టర్ కథాంశంతో ఉండే మూవీ ఇది అంటున్నారు. సందీప్ కోరిక మేరకు నిర్మాతలు రణ్ బీర్ సింగ్ ను కలిపించారు. కథ చెబితే అతనికి నచ్చింది. అతనే సందీప్ నెక్ట్స్ హీరో అన్నారు. కానీ ఇన్నాళ్లైనా మళ్లీ ఆ ఊసే లేదు. మొత్తంగా సందీప్ నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం మరింత కాలం వెయిట్ చేయాల్సిందే అనేలా కనిపిస్తోంది పరిస్థితి. ఏదేమైనా సందీప్ రెడ్డికి తన నెక్ట్స్ సినిమా విషయంలో హడావిడీ లేకపోయినా.. ఆడియన్స్లో అది అనుమానాలకు కారణమవుతుందనే చెప్పాలి.

tollywood news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here