అల్లు అర్జున్ అరెస్ట్ అంశంపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును కరెక్ట్ కాదని, జాతీయ అవార్డు గెలుచుకున్న స్టార్ అల్లు అర్జున్ అరెస్టు పాలకుల అభద్రతాభావానికి తార్కాణమని అన్నారు. తొక్కిసలాట బాధితుల పట్ల తనకు పూర్తి సానుభూతి ఉందని, కానీ అసలు తప్పు ఎవరిదో తేల్చాలన్నారు. నేరుగా ఆయనకు సంబంధం లేని అంశంలో అల్లు అర్జున్ ను సాధారణ నేరస్తుడిలా పరిగణించడం సరైంది కాదన్నారు. సంబంధంలేని అంశంలో అల్లు అర్జున్ అరెస్టు చేయడం న్యాయమైతే… హైడ్రా పేరుతో పేద ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి వారి మరణానికి కారణమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కూడా కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.