మున్సిపాలిటీలు హై అలర్ట్

36
Arvind Kumar Cautioned Officials
Arvind Kumar Cautioned Officials

Arvind Kumar Cautioned Officials

వర్షాలు, వరదల సహాయక చర్యలు ముమ్మరం చేయాలని రాష్ట్రంలోని మున్సిపల్ కమిషనర్లకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ ఆదేశించారు. బుధవారం సాయంత్రం హైదరాబాద్ సిడిఎంఎ కార్యాలయం నుంచి మున్సిపల్ శాఖ డైరెక్టర్ డాక్టర్ సత్యనారాయణతో కలిసి మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీల పరిధిలో ఎక్కడా కూడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 24 గంటల పాటు పనిచేసే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరిస్థితులను సమీక్షించాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి ఆహారం తాగు నీటి సదుపాయాలు కల్పించాలని సూచించారు.

శిధిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించి వాటి పరిసరాల్లోకి ఎవరు వెళ్ళకుండా చర్యలు తీసుకోవాలని, ఆ తర్వాత వాటి విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. వర్షాలు ఆగిపోయిన వెంటనే ప్రజలకు ఎలాంటి అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పట్టణ ప్రాంతాలలో మున్సిపాలిటీ పరిధిలోని అపార్ట్మెంట్స్ సెల్లార్ లలో నీటి నిల్వలు ఉండకుండా వెంటనే పంపింగ్ చేయించాలని కోరారు.

Telangana Municipal Department

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here