Asaduddin anti-CAA rally Postponed
దేశ రాజధానిలో ఢిల్లీ చోటు చేసుకుంటున్న ఘటనల ప్రభావం దేశంలో ఇతర రాష్ట్రాలపై కూడా పడుతుంది. సీఏఏ పౌరసత్వ సవరణ చట్ట వ్యతిరేక, అనుకూల అల్లర్ల ఎఫెక్ట్ ఓవైసీ సభకు తాకింది. మహారాష్ట్రలో ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సభ వాయిదా పడింది . మహారాష్ట్ర థానే జిల్లాలోని భీవండిలో స్థానిక ఎంఐఎం నేతలు గురువారం నిర్వహించే సీఏఏ, ఎన్ఆర్సీ వ్యతిరేక బహిరంగ సభను పోలీసులు రద్దు చేశారు. ఈ సభకు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించాల్సింది. అయితే.. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఎంఐఎం నేతలు నిర్వహించే ఈ సభను వాయిదా వేయాలని బుధవారం పోలీసులు కోరారు. ఇక ఎంఐఎం నేతలు పోలీసుల అభ్యర్థనకు సానుకూలంగా స్పందించి తమ సభను వాయిదా వేస్తున్నట్లు తెలిపారని డీసీపీ రాజ్‌కుమార్ షిండే పేర్కొన్నారు. అదే విధంగా గురువారం సాయంత్రం ముంబైలోని భీవండిలో జరగబోయే ఎంఐఎం బహిరంగ సభ వాయిదా పడిందని ఔరంగాబాద్ ఎంపీ ఇంతియాజ్ జలీల్ తన ట్విటర్ ఖాతాలో తెలిపారు. ఈ సభను మార్చి నెల రెండో వారంలో నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.