పోరాటం మసీదు కోసం భూమి కోసం కాదన్న అసదుద్దీన్

122
Asaduddin Comments On Ayodya land
Asaduddin Comments On Ayodya land

Asaduddin Comments On Ayodya land

అయోధ్యపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మరోమారు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పుపై తన అసంతృప్తి వ్యక్తం చేశారు. మిలాదున్ నబీ సందర్భంగా దారుస్సలాంలో నిర్వహించిన బహిరంగ సభలో ఒవైసీ మాట్లాడుతూ.. బాబ్రీ మసీదు తనకున్న చట్టపరమైన హక్కు అని అన్నారు. తన పోరాటం మసీదు కోసమేనని, భూమి కోసం కాదని స్పష్టం చేశారు. తాము బిచ్చగాళ్లం కాదన్నారు.

ఎవరైనా మన ఇల్లును కూల్చివేసినప్పుడు మధ్యవర్తి వద్దకు వెళ్తే, కూల్చేసిన వారికే ఆయన ఆ స్థలాన్ని ఇచ్చేస్తే ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ఇంటిని కోల్పోయిన మీకు వేరే చోట స్థలాన్ని ఇస్తే మీకెలా అనిపిస్తుందని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు తమను అవమానించిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాబ్రీ మసీదు కట్టడమే చట్ట విరుద్ధమని ప్రచారం చేస్తున్నారని, అటువంటప్పుడు దానిని కూల్చేసిన ఘటనపై అద్వానీపై చార్జిషీటు ఎందుకు దాఖలు చేశారని, ఎందుకు విచారణ జరపాల్సి వచ్చిందో చెప్పాలని అసద్ నిలదీశారు. తమకు ప్రత్యామ్నాయంగా ఇస్తామని చెప్పిన ఐదెకరాల భూమి విషయంలో మొన్నటికి మొన్న తీవ్ర అసహనం వ్యక్తం చేసిన అసదుద్దీన్ ఓవైసీ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

tags : asaduddin owisi, mp, mim party, hyderabad, ayodhya verdict, supreem court judgement

పవన్ ముగ్గురు భార్యల పిల్లలు ఏ స్కూల్స్ లో చదువుతున్నారు

కాచిగూడలో రెండు రైళ్ల ఢీ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here