అయోధ్య తీర్పుపై అసదుద్దీన్ తీవ్ర వ్యాఖ్యలు

248
Asaduddin Hot comments On Ayodhya verdict
Asaduddin Hot comments On Ayodhya verdict
Asaduddin Hot comments On Ayodhya verdict

హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అయోధ్య కేసు తీర్పుపై ముస్లింలను రెచ్చగొట్టేలా న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అవమానించేలా చేస్తున్న వ్యాఖ్యలపై కేసు నమోదు అయ్యింది.  మధ్యప్రదేశ్‌ లోని జహంగీర్‌బాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు పోలీసులు .అసద్ చేసిన వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్‌కు చెందిన న్యాయవాది పవన్‌కుమార్ యాదవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. జహంగీర్‌బాద్ పోలీస్ స్టేషన్‌లో ఒవైసీపై ఫిర్యాదు చేశారు. పవన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయోధ్యపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అసదుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సుప్రీం తీర్పుతో ముస్లింలకు తీరని అన్యాయం జరిగిందని, తనకు తీవ్ర అసంతృప్తిని మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్లో బాబ్రీ మసీదును కూల్చి ఉండకపోతే ఇప్పుడీ తీర్పు వచ్చేది కాదని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తామంటూనే అదే సర్వోన్నతమైనది కాదని అసద్ వ్యాఖ్యానించారు.అయోధ్యలో మసీదు నిర్మాణానికి ఐదెకరాలు కేటాయించాలన్న కోర్టు ఆదేశాలపైనా అసద్ స్పందించారు.  సుప్రీంకోర్టు ఒక వర్గం వారికి తీర్పు ఇచ్చినట్లుగా అనిపిస్తుందని  ఆయన అభిప్రాయపడ్డారు.  అక్కడ బాబ్రీ మసీదు ఉందన్న విషయం శాస్త్రీయంగా తేలిందన్నారు అసదుద్దీన్ ఓవైసీ, ఈ విషయంలో ముస్లిం దానికి అన్యాయం జరిగిందని పేర్కొన్నారు.  ఐదెకరాల భూమి తమకు అవసరం లేదని,  తాము ఎవరినీ భూమి కావాలని  యాచించ లేదని పేర్కొన్నారు. ఎవరి వద్ద తమ చేతులు చాప లేదని ఆయన అన్నారు. తాము న్యాయబద్ధంగా పోరాటం చేసి బాబ్రీ మసీదు భూమిని కోల్పోవడం బాధాకరంగా ఉందన్నారు.  బాబ్రీ మసీదు నిర్మాణానికి ఐదు ఎకరాల స్థలాన్ని ఇవ్వాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మేము మరోసారి   కోర్టును పునఃపరిశీలించాలని కోరతామని  అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు.  రాజ్యాంగంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని తమ హక్కుల కోసం కచ్చితంగా పోరాడతామని  అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు.   భారతదేశంలో ఉన్న ముస్లింలు మసీదుకు ఐదెకరాల భూమిని పొందలేని అణగారిన వర్గాల వారు కాదు అని  ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

tags :  Ayodhya verdict, Supreme Court, central government,  Ranjan Gagoi, Chief justice of india , Hindus, muslims, asaduddin owaisi, madhyapradesh, case filed

https://tsnews.tv/judgment-on-rtc-strike-in-high-court-today/
https://tsnews.tv/ap-new-cs-neelam-sahani/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here