అస‌లేం జ‌రిగింది ఫ‌స్ట్ డే చూస్తా

  • ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ‌
indraganti mohan krishna launched asalem jarigindhi movie song

నిర్మ‌ల్ జిల్లాలోని క‌డెం రిజ‌ర్వాయ‌ర్ అందాల్ని చూసి అగ్ర ద‌ర్శ‌కుడు ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ముగ్దుల‌య్యారు. ద‌స‌రా సంద‌ర్భంగా అస‌లేం జ‌రిగింది? సినిమాలోని నిన్ను చూడ‌కుండా.. మ‌న‌సు ఆగ‌దే అనే పాట‌ను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. కొత్త లొకేష‌న్ల కోసం త‌రుచూ విదేశాల‌కు వెళుతుంటామ‌ని.. తెలంగాణ రాష్ట్రంలోనే ఇంత సుంద‌ర‌మైన ప్రాంతాలున్నాయ‌ని తెలియ‌ద‌న్నారు. అస‌లేం జ‌రిగింది చిత్రం ద్వారా త‌న‌కు కొత్త ప్రాంతాల్ని అస‌లేం జ‌రిగింది చిత్ర యూనిట్ ప‌రిచ‌యం చేసినందుకు ఆనందంగా ఉంద‌న్నారు. త‌ను తీసిన ప‌లు చిత్రాల‌తో పాటు ఇతర సినిమాలకు అసోసియేట్ కెమెరామ‌న్ గా ప‌ని చేసిన‌ రాఘ‌వ.. ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా పరిచ‌యం అవుతున్నందుకు సంతోషంగా ఉంద‌న్నారు. థ్రిల్ల‌ర్ జాన‌ర్‌లో చిత్రీక‌రించిన‌ ఇలాంటి సినిమాల‌కు మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంద‌ని తెలిపారు. ఈ సినిమాను మొద‌టి రోజే ప్రేక్ష‌కుల మ‌ధ్య‌లో కూర్చుని చూసేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. ఈ సంద‌ర్భంగా నిర్మాత కింగ్ జాన్స‌న్ కొయ్య‌డ మాట్లాడుతూ.. డాక్ట‌ర్ చ‌ల్లా భాగ్య‌ల‌క్ష్మీ రాసిన ఈ పాట‌ను యాజిన్ నిజార్‌, మాళ‌విక‌లు క‌లిసి ఎంతో మెలోడియ‌స్‌గా పాడార‌ని తెలిపారు. అక్టోబ‌రు 22న సినిమాను విడుద‌ల చేస్తున్నామ‌ని తెలిపారు. ద‌ర్శ‌కుడు ఎన్‌వీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో జ‌రిగిన య‌దార్థ సంఘ‌ట‌న‌ల‌పై తీసిన చిత్రం ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతుంద‌న్న ఆశాభావాన్ని వ్య‌క్తం చేశారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article