ASALEM JARIGINDHI SANKRANTHI WISHES
ఎక్సోడస్ మీడియా పతకంపై ఎన్‌వీఆర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమే అసలేం జరిగింది. ప్రీ ప్రొడక్షన్ పనులు చురుగ్గా సాగుతున్నాయని తెలిసింది. తెలంగాణలో ఇంతవరకూ ఎవరూ తీయని కొత్త ప్రాంతాల్లో ఈ సినిమాను చిత్రీకరిస్తున్నామని ఇప్పటికే నిర్మాత ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ లవ్ స్టోరీని ప్రప్రథమంగా తెలంగాణలో అందమైన లొకేషన్లలో షూట్ చేయాలని నిర్ణయించారు. ఇదే విషయాన్ని ఇటీవల పోస్టర్ లాంచ్ సందర్భంగా నిర్మాత వెల్లడించారు.
అసలేం జరిగింది? సంక్రాంతి శుభాకాంక్షలు
