KOLLA Ashok Kumar movie stopped
ప్రముఖ పార్లమెంట్ సభ్యుడు గల్లా అశోక్ తనయుడు.. సూపర్‌స్టార్ మహేష్ మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా సినిమా ప్రారంభం అయ్యింది. `అదేనువ్వు అదే నేను` పేరుతో గత ఏడాది ప్రారంభమైన ఈ చిత్రంలో నభా నటేశ్ హీరోయిన్‌గా ఎంపికైంది. శశి అనే డెబ్యూ డైరెక్టన్‌లో దిల్‌రాజుతో పాటు గల్లా వారి స్వంత నిర్మాణ సంస్థ అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈసినిమాను నిర్మించడానికి రెడీ అయ్యారు. అయితే ఇప్పుడు ఈ సినిమా ఆగిపోయిందని సినీ వర్గాల్లో వార్తలు వినపడుతున్నాయి. అయితే దీనిపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి. కానీ సినిమా ఆగిపోయిందో అనడానికి కారణాలు మాత్రం తెలియడం లేదు. స్టార్ ఫ్యామిలీలకు సంబంధించి నాగచైతన్యను హీరోగా పరిచయం చేసిన దిల్‌రాజు మరో స్టార్ హీరో ఫ్యామిలీకి చెందిన గల్లా అశోక్‌ను హీరోగా పరిచయం చేయడానికి ముందుకు వచ్చాడు. అయితే ఇప్పుడు ఈ సినిమాపై సందేహాలు నెలకొన్నాయి.