-
నా లెక్క తప్పింది… క్షమించండి!
-
వివాదస్పద జ్యోతిష్కుడు వేణుస్వామి
నా లెక్క తప్పింది…. క్షమించండి అంటూ వివాద స్పద జ్యోతిష్కుడు వేణుస్వామి ఏపీ ప్రజలను కోరారు. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందని…మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ అవుతారని తాను చెప్పానని అన్నారు. కానీ రాష్ట్ర ప్రజలు కూటమి వైపు మొగ్గుచూపారన్నారు. అయితే కేంద్రంలో నరేంద్రమోడీ బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చే అవకాశం లేదని చెప్పానని….అది నిజమైందన్నారు.
ఎన్ డిఏ, ఇండియా కూటమిల మధ్య పోరు హోరాహోరిగా కొనసాగుతోందన్నారు. కేంద్రంలో తాను చెప్పింది నిజం కాగా….ఏపీలో మాత్రం ఎక్కడో తేడా కొట్టిందన్నారు. ఇందుకు బేషరతుగా రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెబుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.