ఏయూ ఉద్యోగుల జెఎసి నిరసన…

విశాఖ:టిడిపి మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆంధ్రా యూనివర్సిటీ ని, యూనివర్సిటీ అభివృద్ధిని ఉద్దేశించి అసభ్య పదాలతో అవమాన పరిచినట్లు గా ట్విట్టర్లో పోస్ట్ చేయడాన్ని ఆంధ్రా యూనివర్సిటీ ఉద్యోగులు తీవ్రంగా ఖండించారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు పై చట్టపరమైన చర్యలు తీసుకొని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద రాస్తారోకో నిర్వహించారు. అనంతరం టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు దిష్టిబొమ్మ దగ్ధం ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఉద్యోగులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్ర యూనివర్సిటీ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆంధ్రా యూనివర్సిటీ భూముల పైన, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పైన, అలాగే యూనివర్సిటీలో కండోమ్ లు అని ప్రచారం చేస్తూ ట్విట్టర్ లో పోస్టింగులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎంతోమంది మేధావులు చదువుకున్న ఆంధ్ర యూనివర్సిటీ చరిత్ర అయ్యన్నపాత్రుడు కి తెలుసా అని ప్రశ్నించారు. యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఆధ్వర్యంలో విశ్వవిద్యాల యాన్ని అభివృద్ధి చేస్తున్న తరుణంలో సభ్య సమాజం సిగ్గుపడే విధంగా అయ్యన్నపాత్రుడు పోస్టింగ్లు చేయడం సిగ్గుచేటన్నారు.దీనివలన ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని, యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులను, యూనివర్సిటీ లో పనిచేస్తున్న ఉద్యోగులను, అలాగే ప్రపంచవ్యాప్తంగా యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులను అవమాన పరిచినట్లు గా భావిస్తున్నామన్నారు. తక్షణమే అయ్యన్నపాత్రుడు ఆంధ్ర యూనివర్సిటీ కి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article