క్రికెట్ చరిత్రలో ఆసీస్ కొత్త రికార్డు

Australia New Record on Cricket History

  • ఇప్పటివరకు వెయ్యి మ్యాచ్ లలో గెలుపు
  • 711 విజయాలతో మూడో స్థానంలో భారత్

ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియా సరికొత్త రికార్డు సృష్టించింది. అన్ని ఫార్మాట్లలో కలిసి ఈ జట్టు సాధించిన విజయాల సంఖ్య వెయ్యికి చేరుకుంది. తద్వారా అరుదైన మైలురాయి అందుకుంది. భారత్‌తో సిడ్నీలో జరిగిన తొలి వన్డేలో 34 పరుగుల తేడాతో గెలవడంతో ఆసీస్‌ ఖాతాలో 1000వ విజయం పడింది. 384 టెస్టులు, 558 వన్డేలు, 58 టీ20ల్లో ఆసీస్ విజయం సాధించింది. 1877లో మెల్‌బోర్న్ లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా తొలి గెలుపు అందుకున్న కంగారూ జట్టు.. అనంతరం తన యాత్రను ఎక్కువగా విజయాలతోనే కొనసాగించింది. 1951లో వెస్టిండీస్‌పై 100వ విజయం సాధించగా, 200వ విజయాన్ని 1981లో భారత్‌పై సాధించింది. ఇక 300, 400 విజయాలను ఇంగ్లండ్‌పైనే ఆసీస్‌ నమోదు చేసింది. పాకిస్థాన్ పై 500వ విజయం, వెస్టిండీస్ పై 600వ విజయం, భారత్‌పై 700వ విజయం, మళ్లీ పాక్ పై 800వ విజయం సాధించిన ఆసీస్.. ఇంగ్లండ్ పై 900వ విజయం నమోదు చేసుకుంది. కాగా, క్రికెట్ కు పుట్టినిల్లు అయిన ఇంగ్లండ్.. ఈ జాబితాలో రెండో స్థానంలో ఉండటం విశేషం. ఇంగ్లండ్ ఇప‍్పటివరకూ 774 విజయాలు సాధించింది. ఇక భారత్‌ 711 విజయాలతో మూడో స్థానంలో ఉంది. అయితే, వన్డే విజయాల పరంగా చూస్తే భారత్‌ రెండో స్థానంలో ఉంది. వన్డే ఫార్మాట్‌లో భారత్‌ 492 మ్యాచ్ ల్లో గెలుపు సాధించింది.

Check out MS DHONI Signed Bat CLICK HERE

Cutting Edge on Cricket Check here 

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article