సీఎం ఇంటి ముందు ఆత్మహత్యాయత్నం

Auto driver attempt the sucide at Pragathi bhavan

హైదరాబాద్, ప్రగతిభవన్ ఎదుట తెలంగాణ ఉద్యమకారుడు మరియు ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. డబుల్ బెడ్‌ రూం ఇళ్లు ఇవ్వాలంటూ శుక్రవారం ఉదయం సీఎం క్యాంపు ఆఫీస్ ఎదుట ఆటో డ్రైవర్ చందర్ కిరోసిన్ పోసుకుని బలవన్మరణానికి యత్నించాడు. వెంటనే గుర్తించిన పోలీసులు చందర్‌ను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.ఇక 2010లోనూ అసెంబ్లీ ఎదుట చందర్ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. అప్పుడు కూడా పోలీసులు అడ్డుకుని కౌన్సిలింగ్  ఇచ్చారు. ఆటో డ్రైవర్ చందర్ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. తెలంగాణ వచ్చినా ఉద్యోగాలు లేవు.. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదంటూ చందర్‌ నిరసన తెలిపాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *