లోకేష్ నమ్మొద్దు అని అవంతి తీవ్ర వ్యాఖ్యలు

గంటా శ్రీనివాస్ పాము …  Avanthi sensational comments on Lokesh

గంటా శ్రీనివాస్ పై అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గంటా టార్గెట్ దీనిని టికెట్ కాదని సీఎం కుర్చీ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. గంటా శ్రీనివాస్ పాము లాంటి వాడిని తనను నమ్మొద్దని పాముకు పాలు పోసిన విషమే కక్కుతుంది అంటూ నారా లోకేష్ కు వైసీపీ నేత, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ హితబోధ చేశారు. మంత్రి లోకేష్ గారూ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావును నమ్మెుద్దు అని హితవు పలికారు.
తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి విశాఖపట్నం చేరుకున్న ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి గంటా శ్రీనివాస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
గంటా అసలు స్వరూపం మీకు తెలియదని మంత్రి అయ్యన్న పాత్రుడుని అడిగితే చెప్తారని చెప్పుకొచ్చారు. గంటా అనే పాముని జేబులో పెట్టుకుని తిరుగుతున్నారు తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు. నమ్మించి మోసం చెయ్యడంలో మంత్రి గంటా శ్రీనివాసరావు ఆరితేరిపోయారని విమర్శించారు డబ్బుతో ఏదైనా చేయొచ్చని భావించే వ్యక్తి గంటా అన్న ఆయన భీమిలిలో గంటా శ్రీనివాస్ తో తాడోపేడో తేల్చుకోవడానికి వచ్చే ఎన్నికల బరిలోకి దిగనున్నారు.
భీమిలి నియోజకవర్గ ప్రజలను గంటా శ్రీనివాస్ హీనంగా చూస్తున్నారని ఆరోపించైనా ఆయన తానంతట తాను టీడీపీలోకి వెళ్లలేదని వాళ్లు పిలిస్తేనే వెళ్లానని అవంతి శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. తనకు రెండు లక్షల మంది విద్యార్థుల శక్తి ఉందని నైతిక విలువలకు కట్టుబడే రాజకీయాలు చేస్తానే తప్ప వక్రమార్గాలు అనసరించనన్నారు ఎంపీ అవంతి శ్రీనివాస్. ఈసారి ఎన్నికల్లో గంటా శ్రీనివాస్ కు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని అవంతి శ్రీనివాస్ ప్రకటించారు.

For More Click Here

More Latest Interesting news
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article