వైఎస్సార్ సీపీలోకి అవంతి శ్రీనివాస్?

AVANTHI SRINIVAS TO JOIN YCP

  • జగన్ సమక్షంలో పార్టీలో చేరనున్న అనకాపల్లి ఎంపీ

అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ వీడి వైఎస్సార్ సీపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. గత మూడు రోజులుగా ఈ వ్యవహారంపై జోరుగా చర్చ సాగుతోంది. భీమిలి అసెంబ్లీ టికెట్ ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ నిరాకరించడంతో ఆయన పార్టీ వీడాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో అనకాపల్లి లోక్ సభ స్థానం నుంచి పోటీచేసి గెలుపొందిన ఆయన.. రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీ బరిలో దిగాలని యోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో భీమిలి లేదా విశాఖ ఉత్తర నియోజకవర్గం సీటు కేటాయించాలని టీడీపీ అధినేత చంద్రబాబును కోరారు. అయితే, అందుకు ఆయన నిరాకరించారు. అదే సమయంలో భీమిలి అసెంబ్లీ టికెట్ ఇవ్వడానికి వైఎస్సార్ సీపీ అంగీకరించింది. దీంతో పార్టీ మారడానికి అవంతి శ్రీనివాస్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. త్వరలో వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌ను కలిసి ఆ పార్టీ కండువా కప్పుకుంటారని సమాచారం. వైఎస్సార్ సీపీ నేతలు ఆయనతో టచ్‌లో ఉన్నారని తెలుస్తోంది. గురువారం ఆయన ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించనున్నారని, సాయంత్రం 4 గంటలకు జగన్‌తో భేటీ అవుతారని సమాచారం.

AP POLITICS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article