సుప్రీం లో అయోధ్య కేసు విచారణ

Ayodhya case in the Supreme court
అయోధ్య కేసు విచారణ  నేడు జరుగుతున్న సందర్భంగా సుప్రీంకోర్టులో హైడ్రామా నడిచింది. విచారణ చివరి రోజున హిందూ మహాసభ ఇక్కడ రాముని జన్మ స్థలం ఉండేదనడానికి సాక్ష్యా ధారాలు ఉన్నాయని చూపడానికి ప్రయత్నించగా, ముస్లిం వక్ఫ్ బోర్డు తరఫు న్యాయవాది రాజీవ్ ధావన్ వాటిని చించి వేశారు. మొదట తాము కొత్త ఆధారాలు సమర్పిస్తామని, ఇందుకు సంబంధించిన పుస్తకాన్ని అందజేసేందుకు అనుమతించాలని హిందూ మహాసభ లాయర్ వికాస్ సింగ్.. కోర్టును కోరారు. (మాజీ ఐపీఎస్ అధికారి కిషోర్ కునాల్ ఈ పుస్తకాన్ని రచించారు). అయితే దీనికి ధావన్ అభ్యంతరం చెప్పారు. ఇది కొత్త పుస్తకం.. దీన్ని రికార్డుల్లో పెట్టాలని చూస్తున్నారు అని ఆయన తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కానీ.. వికాస్ సింగ్ ఆయనతో విభేదిస్తూ.. ఈ బుక్ ని కోర్టుకు తీసుకువచ్చేందుకు న్యాయమూర్తులు అనుమతించారని, రాముడు వివాదాస్పద స్థలంలోనే జన్మించాడని చెబుతున్న ప్రదేశానికి సంబంధించిన ఆధారాలు ఇందులో ఉన్నాయని అన్నారు. దీంతో ఆగ్రహం చెందిన ధావన్ ఈ డాక్యుమెంటును చించివేస్తానన్నారు. రాముడి భార్య సీతాదేవి వంట చేసినట్టు చెబుతున్న వంటగృహం (కిచెన్) నిర్దేశిత స్థలంలో ఉన్నట్టు ఈ బుక్ లోని మ్యాప్ చూపుతోందని వికాస్ సింగ్ పేర్కొన్నారు.
రామజన్మ స్థలానికి ఆధారం కూడా ఈ మ్యాపేనని కూడా ఆయన చెప్పారు.దీంతో రాజీవ్ ధావన్ మళ్ళీ అడ్డు తగిలారు. ఇద్దరు లాయర్లూ గొంతెత్తి వాదులాడుకున్నారు. ఒక దశలో కోపం పట్టలేని రాజీవ్ ధావన్.. ఆ మ్యాప్ ను చించివేశారు. ఇక ఈ సంఘటనతో  చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ విచారణ ఇలాగే కొనసాగితే వాకవుట్ చేస్తామని చెప్పారు.  దీన్ని ముగించి లేచి వెళ్లిపోతామని ఆవేశంగా పేర్కొన్నారు. అసలు ఈ వ్యవస్థే భ్రష్టు పట్టింది.. మేం వాకౌట్ చేస్తాం అని తీవ్ర స్వరంతో అన్నారు. కాస్త శాంతించిన ఆయన ఈ పుస్తకాన్ని తాను చదువుతానని చెప్పారు. అసలు నవంబరు వరకూ చదువుతూనే ఉంటా అని కూడా అన్నారు.  కాగా అయిదుగురు జడ్జీల ధర్మాసనంఈ కేసుకు సంబంధించి పిటిషనర్ల తరఫు లాయర్లు తమ వాదనలను ఈ సాయంత్రం 5 గంటలకల్లా ముగించాలని ఉత్తర్వులిచ్చింది.tags :ayodhya case, ram lala, muslim wakf board, hindu maha sabha, justice ranjan gagoi,

http://tsnews.tv/nagarjuna-sagar-is-a-danger-to-fish/
http://tsnews.tv/murder-attempt-with-knife/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *