అజాదీ కి అమృత్ మహోత్సవ్

213
Azadi Ka Amrut Mahotsav
Azadi Ka Amrut Mahotsav

భారత స్వాతంత్ర్య 75 వ వార్షికోత్సవం “అజాదీ కి అమృత్ మహోత్సవ్” కి సంబంధించి రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో కేంద్ర కేబినెట్ కార్యదర్శి డా.రాజీవ్ గౌబా బుదవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వేడుకలలో ప్రజలను పెద్ద ఎత్తున పాల్గొనే విధంగా ప్రణాళిక రూపొందించాలని ఆయన ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు.12 మార్చి, 2021 న రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రారంభించినట్లు ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ కేంద్ర క్యాబినెట్ కార్యదర్శికి తెలియజేశారు. హైదరాబాద్ లో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మరియు వరంగల్‌ లో గౌరవ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ జాతీయ జెండాను ఎగురవేసినట్లు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా “భారీ ఫ్రీడం రన్ ” కూడా నిర్వహించబడింది. ఇది కాకుండా కవి సమ్మేళనం మరియు ఫోటో ఎగ్జిబిషన్‌లు నిర్వహించబడ్డాయి. భారతదేశ స్వాతంత్ర్య పోరాటాన్ని హైలైట్ చేయడం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. ప్రభుత్వం “అజాదీ కి అమృత్ మహోత్సవ్” వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here