Baahubali Producer New Plan
ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్‌పై `బాహుబలి` సినిమాను నిర్మించి తెలుగు సినిమాను ఖ్యాతిని చాటారు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని. తదుపరి ఏ సినిమాను చేయలేదు. అయితే వీళ్లు సినిమా రంగం కంటే డిజిటల్ రంగంపై ఎక్కువ ఆసక్తిగా ఉన్నారట. అందుకు తగినట్లుగా ఓ టీంను ఏర్పాటు చేసుకుని స్క్రిప్ట్స్ సిద్ధం చేస్తున్నారట. మంచి స్క్రిప్ట్‌తో వెబ్ సిరీస్‌లను నిర్మించి.. వాటిని డిజిటల్ మీడియా సంస్థలకు అమ్మేయాలనుకుంటున్నారట. బాహుబలి నిర్మాతలు అనే బ్రాండ్ ఎలాగూ ఉంది కాబట్టి వారి ప్రాడెక్ట్స్‌కు ఎలాంటి అవాంతరాలుండవని టాక్. ప్రస్తుతం సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ఉధృతిని క్యాష్ చేసుకోవాలని శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ప్లాన్ చేసి అందులో భాగంగా పావులు కదుపుతున్నారని టాక్.
For More Click Here
More Latest Interesting news