చంద్రబాబు తక్షణం ఇల్లు ఖాళీ చెయ్యాలి

Babu Must vacate house immediately

కృష్ణానదికి లక్షలాది క్యూసెక్కుల వరదనీరు పోటెత్తుతున్న నేపధ్యంలో విజయవాడ పరిసర ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. దిగువన ఉన్న పలు లంక గ్రామాలు నీట మునగడమే కాక, వాటికి రాకపోకలు కూడా స్తంభించాయి. మరోవైపు, టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ కూడా వరద ముంపుకు గురయ్యింది. దీంతో చంద్రబాబు ఇంటిని ఖాళీ చెయ్యాలని ఉండవల్లి గ్రామ వీఆర్వో వెళ్లారు. కృష్ణానది ప్రవాహం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో, తక్షణమే ఖాళీ చేయాలని నోటీసు ఇచ్చేందుకు అక్కడకు వెళ్లారు. అయితే, అక్కడ ఎవరూ లేకపోవడంతో… ఇంటి గోడకు నోటీసును అతికించి వచ్చారు. ఈ సందర్భంగా వీఆర్వో మాట్లాడుతూ, ఇప్పటికే 32 మందికి నోటీసులు ఇచ్చామని తెలిపారు.

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి మరో సారి నోటీసులు జారీ అయ్యాయి. గతంలో అక్రమ నిర్మాణం అంటూ సీఆర్డీఏ నోటీసులు జారీ చేసింది. ఆ వ్యవహారం ఇప్పడు కోర్టు పరిధిలోకి వెళ్లటంతో దాని పైన చర్చ మళ్లి ఇప్పుడు వరదల చుట్టూ తిరుగుతోంది. రెండు రోజులుగా చంద్రబాబు నివాసంలో వదర నీరు చేరుతోంది. డ్రోన్ ద్వారా చిత్రీకరించిన విజువల్స్ లో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. అయితే, తమ అధినేత నివాసం వరద నీటిలో ముగినిగిందని చెప్పుకొవటం కోసమే ప్రభుత్వం కుట్ర చేస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది. ఇదే సమయంలో ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజీలోకి వస్తున్న వరద ఉధృతి గంట గంటకూ పెరుగుతోంది. మరో రెండు రోజులు వరద తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. వెళ్లారు. కృష్ణా నది ప్రవాహం ఎక్కువగా ఉన్నందున.. తక్షణమే ఖాళీ చేయాలంటూ నోటీసు ఇచ్చేందుకు ఉండవల్లి గ్రామ వీఆర్వో వెళ్లారు. అయితే అక్కడ ఎవరూ లేకపోవడంతో ఇంటి గోడకు నోటీసులు అంటించి వచ్చారు. ఇప్పటికే 32 మందికి నోటీసులు ఇచ్చామని చెప్పుకొచ్చారు. దీని పైన టీడీపీ నేతలు అధికారికంగా స్పందించలేదు. అయితే, ప్రస్తుతం ఆ నివాసంలో చంద్రబాబు కుటుంబ సభ్యులు ఎవరూ లేరు.

KCR Collector meet

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *