బ్యాడ్ మార్నింగ్ సార్…

116
Bad Morning In AP Assembly
Bad Morning In AP Assembly

Bad Morning In AP Assembly

ఏపీ రాజధాని అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి . ఈ రోజు నుండి మూడు రోజులపాటు ఈ ప్రత్యేక సమావేశాలు కొనసాగనున్నాయి. ఒక పక్క రాజధాని ప్రాంత రైతుల ఆందోళనల మధ్య ఈ సమావేశాలు కొనసాగుతున్నాయి.  పరిపాలన వికేంద్రీకరణపై ఈ ప్రత్యేక సమావేశాల్లో బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు . ఈ క్రమంలో సభ ప్రారంభమైన వెంటనే రాష్ట్ర పరిపాలన అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును  రాష్ట్ర మంత్రి బుగ్గన ప్రవేశపెట్టారు. ఆ తరువాత  సీఆర్డీఏ రద్దు బిల్లును మంత్రి బొత్స ప్రవేశపెట్టారు. అనంతరం వికేంద్రీకరణ బిల్లుపై చర్చను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రారంభించారు. టీడీపీ ఎమ్మెల్యేల నిరసనల మధ్యే ఆయన ప్రసంగం కొనసాగుతోంది. ఇకపోతే  ఈ నేపథ్యంలో అసెంబ్లీ ప్రారంభంలోనే స్పీకర్ తనదైన శైలిలో సెటైర్లు వేయడం ప్రారంభించారు. సభలోకి ఎంటర్ అయిన స్పీకర్ తమ్మినేని.. తన సీట్లో కూర్చోబోతుండగా.. బ్యాడ్ మార్నింగ్ సార్ అంటూ టీడీపీ ఎమ్మెల్యేలు అయనకు  వెల్కమ్ చెప్పారు.  దీనిపై  స్పందించిన స్పీకర్.. ఎవరైనా గుడ్ మార్నింగ్ చెప్పి మంచి జరగాలని కోరుకుంటారని కానీ బ్యాడ్ మార్నింగ్ చెప్పేవారి గురించి ఏం మాట్లాడగలమంటూ స్పీకర్  సెటైర్లు వేశారు .

Bad Morning In AP Assembly,AP capital,three capitals,cabinet meet,ap assembly session

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here