భగత్ కు 90 వేల ఓట్లు?

చావు తప్పి కన్ను లొట్టపోయిందన్నట్లుగా టీఆర్ఎస్ పార్టీ గెలుపు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గెలుపోటములు మధ్య కేవలం నాలుగు శాతం ఓట్ల తేడా ఉంటుందని అంటున్నారు. మరి, అంతిమ ఫలితం ఎలా ఉంటుందో తేలాలంటే, మరికొంత కాలం వేచి చూడక తప్పదు.

154
BAGATH MAY GET 90K VOTES
BAGATH MAY GET 90K VOTES

శనివారం నాగార్జున సాగర్ ఉపఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థ నోముల భగత్ కు 90 వేల ఓట్లు పోలయ్యే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఉప ఎన్నికను ఎట్టి పరిస్థితిలో చేజారకూడదన్న ఉద్దేశ్యంతో అధికార పార్టీ తమ శక్తియుక్తుల్ని ఉపయోగించింది. సునాయసంగా గెలవాల్సిన సీటును ఓడిపోతామనే భయంతో టీఆర్ఎస్ పార్టీ భారీగానే ఖర్చు పెట్టిందని సమాచారం. కరోనాను లెక్క చేయకుండా ప్రజలు ఇళ్లు దాటి ఓట్లు వేయడానికి ముందుకొచ్చారు. అందుకే, సుమారు 88 శాతం దాకా పోలింగ్ జరిగిందని చెప్పొచ్చు. ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీకి 47- 48 శాతం, కాంగ్రెస్ కు 42- 44 శాతం ఓట్లు సంపాదించే అవకాశం ఉంది. ఈ ఎన్నికలో బీజేపీ ఎలాంటి ప్రభావం చూపెట్టలేకపోయింది. కేవలం ఏడు నుంచి ఎనిమిది శాతం ఓట్లు సంపాదించే అవకాశముందని అంచనా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here