సీఎం జగన్ ఇంటి వద్ద ఉద్రిక్తత

33
Bajarangh Dal plant to Attack CM Jagan Home
Bajarangh Dal plant to Attack CM Jagan Home

Bajarangh Dal plant to Attack CM Jagan Home

ఆంధ్రప్రదేశ్ లో ఆలయాలపై జరుగుతున్నదాడులను నిరసిస్తూ హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని జగన్ నివాసం ఎదుట భజ్‌రంగ్ దళ్ ఆందోళనకు దిగింది. హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఏపీమంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన్ను మంత్రివర్గం నుంచి తప్పించాలని.. లేదంటే ఆయన వ్యాఖ్యలకు సీఎం జగనే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. జగన్ నివాసం ముట్టడికి పిలుపునివ్వడంతో ముందుజాగ్రత్తగా లోటప్‌పాండ్‌లో భారీగా పోలీసులు మోహరించారు.  జగన్ నివాసం సమీపంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఐతే ఒక్కసారిగా భజ్‌రంగ్ దళ్ కార్యకర్తలు దూసుకురావడంతో పోలీసులు అడ్డుకున్నారు. దాంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఉద్రిక్తతల మధ్యే ఆందోళనకారులను అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు పోలీసులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here