అల్వాల్ లో దారుణ హత్య

అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది.. బాలకృష్ణ అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేసి హతమార్చారు..మద్యం మత్తులో యువకుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు..తన ఇంట్లోనే అతనిపై దాడి చేసి చంపేశారు. రాత్రి సమయంలో ఇద్దరు వ్యక్తులు ఇంట్లోకి వచ్చి నట్లు సీసీ కెమెరాల ద్వారా పోలీసులు గుర్తించారు. బాలకృష్ణ అనే వ్యక్తి గతంలో వివాహం జరిగిందని ప్రస్తుతం భార్య భర్తలు విడిగా ఉంటున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు..స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని హత్య జరిగిన తీరును పరిశీలిస్తున్నారు..బాలకృష్ణ హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.చనిపోయిన చోట మద్యం సీసాలను పోలీసులు గుర్తించారు.ఘటన స్థలికి చేరుకున్న క్లూస్ టీమ్ ఆధారాలను సేకరిస్తున్నారు..మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు .కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్యకు గల అన్ని కారణాలను విశ్లేషిస్తున్నారు…

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article