నాగబాబుకు షాక్ ఇచ్చిన బాలయ్య అభిమానులు

Balakrishna fans Gave counter for NagaBabu

మెగా బ్రదర్ నాగబాబు బాలయ్యను టార్గెట్ చేసి సంచలనాలకు కేర్ ఆఫ్ గా మారాడు. బాలయ్య ఎవరో తెలియదు అన్న వ్యాఖ్యల నుండి నేటి వరకు ఏదో రకంగా బాలకృష్ణ ను ఆయన టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఇక ఈ నేపధ్యంలో నాగబాబు బాలయ్య అభిమానలుకు టార్గెట్ అవుతున్నారు. సోషల్ మీడియా లో అభిమానులు నాగబాబును విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. మెగా సోదరుడు నాగబాబుకి బాలయ్య అభిమానుల నుంచి నిరసన సెగ తగిలింది. గత కొంతకాలంగా.. సోషల్ మీడియా వేదికగా.. బాలయ్య,, నాగబాబుల మధ్య ఇగో వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఎవరో తనకు తెలియదని బాలకృష్ణ.. బాలయ్య ఎవరో తనకు తెలీదని నాగబాబు చేసిన కామెంట్స్.. హాట్ టాపిక్ గా మారాయి.
అక్కడితో ఆగకుండా నాగబాబు.. బాలకృష్ణ మీద తరచూ సోషల్ మీడియాలో ఇండైరెక్ట్ గా ఏదో ఒక సెటైర్ వేస్తూనే ఉన్నారు. ఆయన సెటైర్లకు నందమూరి అభిమానులు కూడా అదే రీతిలో సమాధానం చెబుతున్నారు.కాగా.. తాజాగా చెన్నైలో నాగబాబుపై బాలయ్య అభిమానులన నిరసన వ్యక్తం చేశారు. నాగబాబు చెన్నైలోని ఓ కాలేజీ లో జరుగుతున్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే.. ఆ కార్యక్రమంలో నాగబాబు మైక్ అందుకొని మాట్లాడటం మొదలుపెట్టగానే.. కొందరు విద్యార్థులు..‘‘బాలయ్య..బాలయ్య’’ అంటూ నినాదాలు చేశారు. వారి నినాదాలకు నాగబాబు అసహనం వ్యక్తం చేశారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article