Balakrishna Sensational comments on Laxmis NTR
ఎన్టీఆర్ కథానాయకుడికి పోటీగా ఆర్జీవీ తెరకెక్కించిన చిత్రం లక్ష్హ్మీస్ ఎన్టీఆర్ . ఇక ఈ సినిమా బాలయ్య నిర్మిస్తున్న, నటిస్తున్న ఎన్టీఆర్ సినిమాకు కౌంటర్ గా తెరకెక్కుతున్న చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ అని అందరికీ తెలుసు. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను రూపొందిస్తోన్న సంగతి మాత్రమే కాదు ఈ సినిమాతో చంద్రబాబును టార్గెట్ చేస్తున్నారని కూడా అందరికీ తెలుసు. ఇక ఈ సినిమా లక్ష్మీ పార్వతి కోణంలో ఈ సినిమా ఉంటుందని సమాచారం. ఎన్టీఆర్ బయోపిక్ కి పోటీగా ఈ సినిమా విడుదల చేయాలని వర్మ ప్లాన్ చేస్తున్నాడు.
అయితే ఈ బయోపిక్ పై ఇప్పటివరకు నందమూరి హీరోలు కామెంట్ చేయలేదు. తాజాగా బాలకృష్ణ ఈ బయోపిక్ పై స్పందిస్తూ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బాలయ్యని.. ‘ఎన్టీఆర్’ బయోపిక్ ని ముందు వర్మతో అనుకొని ఆ తరువాత ఆయన్ను కాదన్నందుకే ఈ సినిమాకి పోటీగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ను తీస్తున్నారని అంటున్నారు..? దానికి మీరేం అంటారని బాలయ్యని ప్రశ్నించగా.. నవ్వుతూ.. వర్మ ఏం కథ తీస్తున్నారో, ఏ కోణంలో తీస్తున్నారో.. నాకు తెలియదని అన్నారు.
ఏ సినిమా తీయాలనేది ఆయన ఇష్టమని, అది ఆయన వ్యక్తిగత విషయమని చెప్పారు. వర్మ తమ అనుమతి తీసుకోలేదని, ఎన్టీఆర్ బయోపిక్ మాత్రం అందరి అనుమతి తీసుకొని చేస్తున్నట్లు స్పష్టం చేశారు. దాంతో పాటు ఈ సినిమాలపై తన రియాక్షన్ కంటే జనం రియాక్షన్ ముఖ్యమని తెలిపారు.