Balaya Going to Act in Kannada Movie
నందమూరి బాలకృష్ణ కన్నడ చిత్రంలో నటించబోతున్నారా! .. అంటే అవుననే ఫిలింనగర్ వర్గాల సమాచారం. వివరాల్లోకెళ్తే కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్ 125వ చిత్రం `భైరతి రణగల్`లో నటించబోతున్నారు. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం దర్శక నిర్మాత నర్తన్ బాలయ్యను కలిశారట. బాలయ్య కూడా నటించడానికి ఓకే అన్నట్లు వార్తలు వినపడుతున్నాయి. బాలకృష్ణ 100వ చిత్రం `గౌతమిపుత్ర శాతకర్ణ`లో శివరాజ్‌కుమార్ చిత్ర పాత్రలో నటించిన సంగతి తెలిసిందే .ఇప్పుడు ఆయన చిత్రంలో బాలకృష్ణ గెస్ట్ రోల్ చేయబోతున్నారన్నమాట. అయితే దీనిపై బాలకృష్ణ తరపు నుండి ఎలాంటి సమాచారం అధికారికంగా రాలేదు. మరి దీనిపై బాలయ్య ఎలా స్పందిస్తాడో చూడాలి.