హిందూపురంలో నిరసన సెగపై బాలకృష్ణ ఫైర్

136
Is balayaa plan work out?
Is balayaa plan work out?

Balayya Fires On Hindupur YCP Protest

రాజధాని వికేంద్రీకరణ సెగ హిందూపురంలో బాలయ్యకు తగిలింది. మూడు రాజదానులకు బాలయ్య వ్యతిరేకం అని,  నియోజకవర్గ పర్యటనకు వెళ్లిన బాలకృష్ణను  కొందరు వైసీపీ నిరసన కారులు అడ్డుకున్నారు. అయితే పోలీసుల జోక్యంతో బాలయ్య నిన్న వారి నుంచి క్షేమంగా బయట పడ్డారు. దీనిపై బాలయ్య స్పందించారు.నాకు చట్టంపై గౌరవం ఉంది కాబట్టి నేను మౌనంగా ఉన్నానని ఆయన వ్యాఖ్యానించారు . నేను కనుక ఒక్క సైగ చేస్తే ఏమై ఉండేదో అందరికీ తెలుసు. పరిస్థితులు ఉద్రిక్తత కు దారి తీయకూడదు అనే నేను ఊరుకున్నాను అని బాలయ్య అన్నారు. నా మౌనం భయంకరం అన్నబాలకృష్ణ  చేతకాక సైలెంట్ గా ఉన్నామనుకోవద్దు అని చెప్పారు.  వైయస్ఆర్సిపి కార్యకర్తలకు గట్టి హెచ్చరిక  జారీ చేశారు  బాలకృష్ణ . ఈ తరహా కార్యకలాపాలను తాను ఎప్పుడూ చూడలేదని అన్నారు. ఇది విష సంస్కృతి అని విమర్శించారు. కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి  సంబంధించిన ఇరవై మంది మాత్రమే భయాందోళనలు సృష్టించారని, వెయ్యి మందికి పైగా ఉన్న తన అనుచరులకు ఒక సైగ చేస్తే వారి పరిస్థితి  ఏమిటని ప్రశ్నించారు. సమస్యలను సృష్టించడం టిడిపి  సంప్రదాయం కాదని బాలకృష్ణ అన్నారు.

Balayya Fires On Hindupur YCP Protest,Andhrapradesh ,AP CM Jagan mohan reddy , Hindupur TDP MLA, Balakrishna , warning, YSRCP activists, hindupur

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here