బాలును అవమానించిన స్టార్స్

44
Balu funeral
Balu funeral

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. తెలుగు వారి ఆస్తి అంటూ తెగ చెప్పుకున్నారు. కానీ ఆయనకు చివరి నివాళి మాత్రం తమిళనాడు ప్రభుత్వం నుంచి దక్కింది. కరోనాతో మరణిస్తే దగ్గరకు రానివ్వరు. కానీ ఆయనకు ఈ నెల 5నే నెగెటివ్ అని తేలింది. కానీ ఊపిరితిత్తులతో పాటు ఇతర అవయవాలు కాస్త ఇబ్బంది పెట్టడం వల్లే లైఫ్ సపోర్ట్ కు వెళ్లారు. చివరికి అవన్నీ ఫెయిల్ అయ్యాయి. బాలు మరణించారు. ఇంతటి పాండమిక్ టైమ్ లో కూడా ఎంతోమంది ఆయన చివరి చూపుకోసం వెళ్లారు. ముఖ్యంగా తమిళనాడు అభిమానులైతే రోడ్లపైనే భోరుమంటూ ఏడ్చారు. అయితే తెలుగువాడైన బాలు కోసం తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కరూ వెళ్లలేదు. మా నుంచి ఒక సంతాప సభ ఏర్పాటు చేయలేదు. అలాగే స్టార్ హీరోలు సైతం బాలు అంత్య క్రియలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. అటు తమిళ్ నాడులోనూ అంతే. ఏ స్టారూ వెళ్లలేదు.

కేవలం ఇళయదళపతి విజయ్ మాత్రమే బాలు అంత్య క్రియలు జరిగే స్థలం వరకూ వెళ్లి ఆయన తనయుడు చరణ్ ను పరామర్శించి.. ఆ కార్యక్రమంలో కాసేపు ఉన్నారు. మరి విజయ్ కంటే మన హీరోలకు అంత ఇబ్బంది ఉంటుందా..? ఏదేమైనా చినిపోయిన తర్వాత బాలు అంత గొప్ప ఇంత గొప్ప అని చెప్పిన ఎంతోమంది గొప్ప హీరోలు సైతం ఆయన అంత్య క్రియలకు దూరంగా ఉండటం ఆశ్చర్యమే. నిజంగా వీరి మనసుల్లో వెళ్లాలని ఉంటే కరోనాకు సంబంధించిన మినిమం జాగ్రత్తలు తీసుకుని వెళ్లి ఉండొచ్చు. బట్ ఎవరూ ఆ వైపు ఆలోచించలేదు. దీంతో తెలుగువాడైన బాలు చివరికి తెలుగు వారు లేకుండానే వెళ్లిపోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here