కేసీఆర్.. థూ… నీ బతుకు చెడ!

‘‘కేసీఆర్… నీకు దమ్ముంటే, నువ్వు మొగోడివైతే నాతో రాజకీయం చెయ్… నాతో చేయడం చేతగాక, తట్టుకోలేక నా కొడుకును లాగుతావా?… నీ మనువడి విషయంలో తప్పుడు వ్యాఖ్యలు చేస్తే నేనే ఖండించిన. చిన్న పిల్లలను రాజకీయాల్లోకి లాగొద్దనే సోయి కూడా లేదా? నా కొడుకు విషయంలో ఎప్పుడో జరిగిన దానిని ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చి కేసు పెట్టిస్తవా? నేను తప్పు చేశానని ఆ అబ్బాయే (దెబ్బలు తిన్న శ్రీరాం అనే విద్యార్థి) ఒప్పుకున్నడు. అయినా పిల్లలు పిల్లలు కొట్లాడుకుంటరు. మళ్లీ కలుస్తారు. మరి నీకేం నొచ్చింది? కేసు పెట్టియాల్సిన అవసరం ఏమొచ్చింది? కంప్లయింట్ ఎవరిచ్చారు? నీ రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారుతావా? నా కొడుకుతోసహా ముగ్గురు పిల్లల జీవితాలను నాశనం చేస్తావా? థూ… నీ బతుకు చెడ… ఎందుకు బతుకుతున్నవో అర్ధం కావడం లేదు’’ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపి బండి సంజయ్ కుమార్ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కొద్దిసేపటి క్రితం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ మనోహర్ రెడ్డి, కోశాధికారి శాంతికుమార్ తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తన కుమారుడిపై కేసీఆర్ ఫ్రభుత్వం కేసు నమోదు చేసిన విషయాన్ని మీడియా ప్రస్తావించగా బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. అంతకుముందు మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యల్లోని ముఖ్యాంశాలు….

• కేసీఆర్ కొడుకు ట్విట్టర్ టిల్లు విదేశాలకు పోయి ప్రధానిని విమర్శించారు. సిగ్గుండాలే. విదేశీ వేదికలపై మన ప్రధానిని విమర్శిస్తారా? దీనిపై కేసీఆర్ స్పందించాలి. అంతేగాదు… యాదాద్రిపై పెట్టుబడి పెట్టినట్లు, రోజుకు కోటి లాభం వస్తుందని చెప్పిండు. అంటే ఆలయాలను, దేవుళ్లను కూడా వ్యాపారంగా మార్చడం సిగ్గు చేటు. యాదాద్రి ఆలయ అభివ్రుద్ధి పేరుతో ఆ చుట్టు పక్కల ఉన్న స్థలాలన్నీ కబ్జా చేసి భూముల రేట్లు పెరగేలా చేశారు. అసలు నయీం డైరీ ఆస్తుల కేసు ఎటు పోయింది? నయీం కబ్జా చేసుకున్న ఆస్తులన్నీ నీ కుటుంబం కబ్జా చేసుకుంది. నయీం సొమ్ము నీ కుటుంబం తీసుకుంది. తిరిగి 1200 కోట్ల పెట్టుబడులు యాదాద్రి పై పెట్టుబడి రోజుకు కోటి లాభం వస్తుందని చెబుతూ ఆలయాన్ని, దేవుడిని కూడా వ్యాపారం చేయడం సిగ్గు చేటు. వేరే మతాల గురించి మాట్లాడే దమ్ము మీకుందా? అయ్యప్పస్వామిని, సరస్వతి అమ్మవారిని, సీతమ్మవారిని తిడితే మాట్లాడవు…. ధర్మం గురించి ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నవ్… పైగా నిఖార్సైన హిందువని చెప్పుకుంటున్నవ్.. సిగ్గు చేటు. ధార్మిక క్షేత్రాలను వ్యాపారం కోసం అభివ్రుద్ధి చేస్తున్నట్లు నమ్మిస్తే… ఆ దేవుడు కూడా నిన్ను క్షమించబోరు. నిజాం మనవడు ఎక్కడో టర్కీలో చనిపోయాడు. ఆయనకు తెలంగాణకు ఏం సంబంధం ? డెడ్ బాడీని ఇక్కడికి రప్పించి అత్యున్నత అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేయాలని ప్రభుత్వం ఎట్లా చెబుతావ? మీ అయ్య సొమ్ము అనుకున్నవా?

• తెలంగాణ వాళ్లను రాచి రంపాన పెట్టి అత్యాచారాలు చేసి రాక్షసత్వం ప్రదర్శించి ఎంతో మందిని చంపిన నిజాంపై నీకెందుకు ప్రేమ. నిజాం ఆస్తులపై నీ కన్ను పడింది. అందుకే వాళ్లను పొగుడుతున్నవ్. రజాకార్ల పార్టీ అయిన ఎంఐఎంతో కులుకుతున్నవ్. పైగా సీఎం అయిన వెంటనే నిజాం సమాధి వద్దకు పోయి మోకరిల్లుతున్నవ్.
హిందూ సమాజం పట్ల కేసీఆర్ కున్న కక్షను ఏ విధంగా తీర్చుకుంటున్నడో… ఈ నెల రోజులుగా జరుగుతున్న సంఘటనలను చూసి హిందువులంతా సంఘటితం కావాలి. పాపం ఊరికే పోదు… దేవుడు వదిలిపెట్టడు. మీ అబ్బాయిపై కేసు పెట్టారు కదా… మీరేమంటారు అంటూ… మీడియా అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ… కేసీఆర్… నీకు దమ్ముంటే, నువ్వు మొగోడివైతే నాతో రాజకీయం చెయ్… నాతో చేయడం చేతగాక, తట్టుకోలేక నా కొడుకును లాగుతావా?

• కేసీఆర్… నీ మనువడి విషయంలో తప్పుడు వ్యాఖ్యలు చేస్తే నేను ఖండించిన. చిన్న పిల్లలను రాజకీయాల్లోకి లాగొద్దని వ్యతిరేకించిన ఎందుకంటే నాకు జ్ఝానం ఉంది? నా కొడుకు విషయంలో ఎప్పుడో జరిగిన దానిని తీసుకొచ్చారు. ఆ అబ్బాయే వీడియో పెట్టారు. పిల్లలు పిల్లలు కొట్లాడుకుంటరు. మళ్లీ కలుస్తారు. మరి నీకేం నొచ్చింది? కేసు పెట్టియాల్సిన అవసరం ఏమొచ్చింది? కంప్లయింట్ ఎవరిచ్చారు? నీ రాజకీయాల కోసం ఏదైనా చేస్తావా? నీ యాదాద్రి భాగోతాన్ని, నిజాం మనువడి అంత్యక్రియలపై ప్రజల ద్రుష్టిని మళ్లించాలని ఇదంతా చేస్తావా? ఆ అమ్మాయి లైఫ్, నా కొడుకు లైఫ్… ఆ అబ్బాయి లైఫ్ ను నాశనం చేయాలని సీఎం కుట్ర. ఛీ.. నీది ఒక బతుకేనా? ఎందుకు బతుకుతున్నవో.. బాయిల దూకు… చదువుకునే పిల్లల జీవితాలతో ఆడుకోవడానికి నీకు సిగ్గులేదా? ముగ్గురి జీవితాలతో ఆడుకుంటున్నవ్. ఆనాడు ఇంటర్మీడియట్ పిల్లలను చంపినవ్.. ఆ పాపం ఊరికే పోలేదు. అందుకే డౌన్ ఫాల్ స్టార్టయ్యింది.

• నా కొడుకు మీ లెక్క మైనర్ అయినా క్యూమార్ట్ బార్ పోయి గొడవ చేయలేదు. మందు కోసం గొడవ చేయలే. మరుసటిరోజు బార్ ను మూసేయించాలని అధికారులను పంపలే… ఎల్సీయస్ కు పోయి అందరినీ బెదిరించి తెల్లవార్లు డ్యాన్సు చేయించలే…అధికారం లేకపోయినా భద్రాద్రిలో తలంబ్రాలు మోయలే. అమ్మాయిలను తీసుకుపోయి స్కూళ్లలో పార్టీలు పెట్టి డ్యాన్సులు చేయించలే… నేను తీయదల్చుకుంటే అవన్నీ బయటపెట్టడానికి గంట కూడా పట్టదు. కానీ పిల్లలను రాజకీయాల్లోకి లాగడం నాకు ఇష్టం లేదు. కానీ నువ్వు… నా కొడుకు లైఫ్ ఖరాబు చేసినవ్ కదా… ఇయాళ రెండు, మూడు పెగ్గులు ఎక్కువ తాగి జల్సా చేసుకోవాలనుకుంటున్నవేమో…. ఆ పాపం ఒట్టిగ పోదు… నేను అమ్మవారిని నమ్ముకున్న. నువ్వు చేసేది కరెక్టా? కాదా? వెళ్లి నీ భార్య, కోడలును అడుగు.

• నా కొడుకు చేసిన తప్పేమిటి? కాలేజీ వాళ్లు కనీసం విచారణ జరిపారా? నోటీసు ఇచ్చారా? కౌన్సిలింగ్ చేశారా? కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాలని తెలియదా? పిల్లలపై కేసు పెట్టిస్తారా? వాళ్లది చిన్న మనసు. తట్టుకోలేకపోతున్నరు. కేసీఆర్… నువ్వు మనిషివి కాదు… నీ పాపం పండింది. నా కొడుకును పోలీస్ స్టేషన్ లో నేనే సరెండర్ చేస్తా… థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తవా? లాఠీలతో కొట్టిస్తవా? చూద్దాం… నీకు అమ్మాయిలపై జరుగుతున్న అఘాయిత్యాలను, వేధింపులను ఆపడం చేతగాదు.. కానీ చిన్న పిల్లలపై కేసులు పెట్టి వాళ్ల జీవితాలను నాశనం చేయాలని చూస్తవా?

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article