సంజయ్ దూకుడు – టీఆర్ఎస్ కు చుక్కెదురు?

26
Bandi Sanjay focus on Grater Elections
Bandi Sanjay focus on Grater Elections

Bandi Sanjay focus on Grater Elections

బండి సంజయ్ బీజేపీ పగ్గాలు చేపట్టాక దూకుడుగా వ్యవహరిస్తన్నారు. ఏ చిన్న అవకాశం దొరికినా టీఆర్ఎస్ పై, ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. కార్యకర్తలు, ప్రజా మద్దతుతో టీఆర్ ఎస్ విధానాలను ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ అధిష్టానం ఇచ్చిన ఏ కార్యక్రమానైనా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడు. అందుకే బండి సంజయ్ ఏ కార్యక్రమం తలపెట్టినా రాష్ర్ట బిజేపీ నాయకులు, కార్యకర్తలు ముందుండి విజయవంతం చేస్తున్నారు.

అయితే త్వరలో గ్రేటర్ ఎన్నికలు రాబోతున్నాయి. జీహెచ్ఎంసీని కైవసం చేసుకోవడానికి బీజేపీ నాయకులు వ్యూహాలు రచిస్తున్నారు. ఈసారి జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి చుక్కలు చూపించడానికి తెలంగాణ బీజేపీ నాయకత్వం రంగంలోకి దిగనుంది. బండి సంజయ్.. గ్రేటర్ ఎన్నికల్లో తన మార్కు ఉండేలా ప్రయత్నం చేస్తున్నారని సమాచారం పార్టీ వర్గాల సమాచారం. గ్రేటర్ ఎన్నికలపై టీఆర్ఎస్ వ్యూహాలను చిత్తు చేయాలని భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో గ్రేటర్ ఎన్నికలే లక్ష్యంగా కమలం‌ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్.. త్వరలో ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో పర్యటించాలనుకుంటున్నారని తెలిసింది. త్వరలో జీహెచ్ఎంసీ డివిజన్లలో సంజయ్ పర్యటించేందుకు రూట్ మ్యాప్ ను కూడా సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. మరి సంజయ్ దూకుడు టీఆర్ ఎస్ నిలువరించేనా? జీహెచ్ఎంసీ బిజేపీ కైవసం చేసుకుంటుందనేది త్వరలో తేలనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here