కేసీఆర్ పాలనకు కాలం చెల్లిందా?

BANDI SANJAY LATEST COMMENTS ON KCR

తెలంగాణలో బీజేపీ టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదగాలనుకుంటుంది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చెయ్యాలని భావిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన బీజేపీ ఇప్పుడు టార్గెట్ టీఆర్ఎస్ అంటుంది. కరీంనగర్‌లో జరిగిన బీజేపీ విస్తృతస్థాయి సమావేశంలో బీజేపీ నేత, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పాల్గొన్నారు. అయితే ఈయన సభలో మాట్లాడుతూ తెలంగాణలో టీఆర్‌ఎస్‌ పతనం ఖాయమైందని అన్నారు. అయితే పేదల సంక్షేమ పథకాల కోసం కేంద్రం నిధులు మంజూరు చేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని పక్క దారి పట్టిస్తుందని ఆరోపించారు. అయితే వివిధ పథకాలలో పేదలకు అందాల్సిన సొమ్మును టీఆర్ఎస్ నాయకులు అడ్డగోలుగా మేస్తున్నారని అక్రమాలకు పాల్పడిన ప్రతి టీఆర్‌ఎస్‌ నాయకులను ఖచ్చితంగా జైలుకి పంపుతామని అన్నారు.

Puri Jagan ISMARTSHANKAR 

అంతేకాదు ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలపై కనీసం స్పందించని ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. అయితే కొండగట్టు ప్రమాదం, నేరెళ్ల బాధితుల పాపం టీఆర్‌ఎస్‌కు తప్పక తగులుతుందని, తెలంగాణలో టీఆర్ఎస్ కు సరిన ప్రత్యామ్నాయంగా బీజేపీ మారుతుందని చెప్పుకొచ్చారు. అంతేకాదు తెలంగాణలో కేసీఅర్ పాలన త్వరలోనే అమ్నంతం కాబోతుందని ప్రజలే ప్రభుత్వంపై తిరగబడుతారని అన్నారు. అంతేకాదు వచ్చే ఎన్నికలలో తెలంగాణలో బీజేపీ గెలుపు తధ్యమని అన్నారు.

#TELANGANA BJP UPDATES

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *