వైరల్ : రోజాతో బండ్ల గణేశ్

201
#Bandla meets roja#
#Bandla meets roja#

#Bandla meets roja#

నిర్మాత, నటుడు బండ్ల గణేశ్, ఎమ్మెల్యే రోజాకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనాల్సిందే. అంతగా విబేధాలున్నాయి వాళ్లిద్దరి మధ్య. చాలాసార్లు ఒకరిపైఒకరు విమర్శలు చేసుకున్నారు. ఓ టీవీ ఛానల్ లైవ్ డిబేట్‌లో వీరిద్దరి తీవ్ర స్థాయిలో గొడవ కూడా జరిగింది. వ్యక్తిగతంగా బూతులు తిట్టుకున్నారు. ఇదంతా గతం… ఇప్పుడు వీళ్లిద్దరు హాయిగా కలిసిపోయారు. మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన వీరిద్దరూ హాయిగా నవ్వుతూ ఫొటోకు ఫోజులిచ్చారు. ఆ ఫోటోను తన ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేశాడు బండ్ల గణేశ్. చాలాకాలం తర్వాత రోజా గారిని కలిశాను. ఆమె కెరీర్ విజయవంతంగా ముందుకు సాగాలి. ఆరోగ్య, ఐశ్వర్యాలు లభించాలని కోరుకుంటున్నా` అంటూ ట్వీట్ చేశాడు. రోజాగారితో దిగిన ఫొటో, బండ్ల గణేశ్ చేసిన ట్విట్ వైరల్ గా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here