భారత్‌లోని హిండన్ ఎయిర్ బేస్‌లో హసీనా విమానం ల్యాండ్ అయింది. బంగ్లాదేశ్‌లో హింస చెలరేగడంతో.. ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేశారు. అయినప్పటికీ బంగ్లాదేశ్‌లో అల్లర్లు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సైనిక పాలనలో బంగ్లాదేశ్ ఉంది. ఈ నేపథ్యంలోనే షేక్ హసీనాకు భారత్ ఆశ్రయమిచ్చింది.
అంతేకాకుండా భారత్–బంగ్లా సరిహద్దులో హై అలర్ట్ కొనసాగుతున్నది. సరిహద్దుల్లో బలగాలను బీఎస్ఎఫ్ అప్రమత్తం చేసింది., కూచ్ బెహార్, పెట్రాపోల్ సరిహద్దుల్లో భద్రత పెంచారు. అటు భారత్ లోని బంగ్లాదేశ్ ఎంబసీ దగ్గర భద్రత పెంచారు. బంగ్లాదేశ్ హై కమిషన్ దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు.