భారత్ దీనస్థితికి బంగ్లాదేశ్ సాయం?

41బంగ్లాదేశ్-పాకిస్తాన్ లాంటి దేశాలు కూడా ఇండియాకు సహాయం చేయడానికి ముందుకొచ్చాయంటే.. మనదేశం ఏ పరిస్థితికి దిగజారిందో చెప్పొచ్చు. ఇది టెస్టులు చేసే సమయం కాదని మంత్రి ఈటెల అన్నారు. ఒక ప్రాంతంలో 100 అపార్ట్మెంట్ లలో 50 వరకు కరోనా కేసులున్నాయని తెలిపారు. లాక్ డౌన్ ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ఈటెల స్పష్టం చేశారు. వ్యాక్సిన్ గురించి భారత్ బయో టెక్- రెడ్డి లాబ్స్ తో ప్రత్యేక భేటీ సీఎస్ ఆధ్వర్యంలో జరిగిందని చెప్పారు.

కోవిడ్ విజృంభిస్తున్న విషయాన్ని కేంద్రం అంచనా వేయడం లో విఫలమైందని.. కరోన విషయం లో రాష్ట్రాలకు కేంద్రం పెద్దగా చేసింది ఎం లేదని ఈటెల రాజెందర్ అభిప్రాయపడ్డారు. అందుకే దేశ వ్యాప్తంగా ఎన్నికలు , కుంభమేళలు నిర్వహించారని తెలిపారు. ముందుగానే కరోనా సెకండ్ వేవ్ గురించి కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని తెలిపారు. వ్యాక్సిన్ కొరత, ఇంజక్షన్ ల సరఫరాలో కేంద్రనికి ముందుచూపు లేదని విమర్శించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here