ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సహా వివిధ జాతీయ, ప్రాంతీయ సెలవుల కారణంగా ఈ నెలలో దేశవ్యాప్తంగా బ్యాంకులకు చాలా రోజుల పాటు సెలవులు వస్తున్నాయి. ఈ సెలవులు రాష్ట్రాన్ని బట్టి మారతాయని, సెలవుల పూర్తి జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తన వెబ్‌సైట్‌లో ఉంచింది. వీటిని ఎక్స్ లో పోస్ట్ చేసింది.
డిసెంబర్ నెలలో, సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్, పా-టోగన్ నెంగ్మింజా సంగ్మా సంస్మరణ రోజులు, యు సోసో థామ్ వర్ధంతి, గోవా విమోచన దినోత్సవం, క్రిస్మస్ ఈవ్, క్రిస్మస్, క్రిస్మస్ వేడుకలు, యు కియాంగ్ నాంగ్‌బా, నూతన సంవత్సర పండుగ/లాసాంగ్/నామ్‌సూంగ్‌తో వంటి సందర్భాలు, వేడుకలు ఉన్నాయి. ఆయా రోజుల్లో, ప్రాంతాన్ని బట్టి బ్యాంకులు సెలవులు పాటిస్తాయి. ఆదివారాలతో పాటు రెండు & నాలుగు శనివారాల్లోనూ దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు మూతబడతాయి. మొత్తంగా 17 రోజులు బ్యాంకులు తెరుచుకోవు.
17మ రోజులు బంద్
డిసెంబర్‌లో 5 ఆదివారాలు వచ్చాయి, ఈ రోజుల్లో బ్యాంక్‌లు పని చేయవు. వీటికి అదనంగా, ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం, అన్ని షెడ్యూల్డ్ & నాన్ షెడ్యూల్డ్ బ్యాంకులు నెలలోని రెండో, నాలుగో శనివారం రోజుల్లో మూతబడతాయి.
ఆర్‌బీఐ పోస్ట్ ప్రకారం ఈ నెలలో బ్యాంక్ సెలవుల జాబితా:
డిసెంబరు 01 (ఆదివారం): దేశవ్యాప్తంగా బ్యాంక్‌లకు సెలవు
డిసెంబరు 3: గోవాలో ముఖ్యమైన ఆచారం అయిన ‘సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఫీస్ట్’ సందర్భంగా, ఆ రాష్ట్రంలో బ్యాంకులు మూతబడతాయి.
డిసెంబరు 08 (ఆదివారం): దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు పని చేయవు
డిసెంబర్ 12: మేఘాలయలో జరుపుకునే ప్రాంతీయ సెలవు దినం ‘ప-టోగన్ నెంగ్మింజ సంగ్మా’. దీనికోసం మేఘాలయలో బ్యాంకులు సెలవులో ఉంటాయి
డిసెంబర్ 14 (శనివారం): రెండో శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు పని చేయవు
డిసెంబరు 15 (ఆదివారం): దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు పని చేయవు
డిసెంబరు 18: మేఘాలయ రాష్ట్ర చరిత్రలో ప్రముఖ వ్యక్తి యు సోసో థామ్ వర్ధంతి సందర్భంగా ఆ రాష్ట్రంలో బ్యాంకులకు హాలిడే
డిసెంబరు 19: పోర్చుగీస్ పాలన అంతమై గోవా స్వాతంత్ర్యం పొందిన రోజు. గోవా విమోచన దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్రంలో బ్యాంకులు సెలవు తీసుకుంటాయి
డిసెంబరు 22 (ఆదివారం): దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు పని చేయవు
డిసెంబర్ 24: క్రిస్మస్ పండుగకు ముందు రోజు మధ్యాహ్నం నుంచి మిజోరం, నాగాలాండ్, మేఘాలయాలో బ్యాంకులకు హాలిడే
డిసెంబర్ 25: క్రిస్మస్ సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు పని చేయవు
డిసెంబర్ 26: మిజోరం, నాగాలాండ్, మేఘాలయలలో పండుగ వేడుకలు కొనసాగుతాయి, బ్యాంకులు మూతబడతాయి
డిసెంబర్ 27: క్రిస్మస్ సంబరాలకు కొనసాగించడానికి నాగాలాండ్‌లో బ్యాంకులు సెలవు తీసుకుంటాయి
డిసెంబర్ 28 (శనివారం): నాలుగో శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు పని చేయవు
డిసెంబరు 29 (ఆదివారం): దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు పని చేయవు
డిసెంబరు 30: స్థానిక నాయకుడు యు కియాంగ్ నంగ్‌బా గౌరవార్ధం మేఘాలయలోని బ్యాంకులకు సెలవు
డిసెంబర్ 31: మిజోరాం, సిక్కింలో నూతన సంవత్సరం ముందస్తు వేడుకలు లేదా లాసాంగ్/నామ్‌సూంగ్ సందర్భంగా బ్యాంకులకు హాలిడే
సెలవుల సమయంలో బ్యాంకింగ్ సేవలు
బ్యాంక్‌లకు సెలవులు ఉన్నప్పటికీ, UPI, IMPS, నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ ఛానెల్‌ల ద్వారా ప్రజలు 24 గంటలూ ఆర్థిక కార్యకలాపాలు కొనసాగించవచ్చని ఆర్ బీఐ వెల్లడించింది.