కార్పొరేట్లకు చేరువకే బ్యాంకుల విలీనం

BANKERS STRIKE LATEST NEWS

ఈరోజు దేశవ్యాప్తంగా ఒక్క రోజు బ్యాంక్ ల సమ్మె జరుగుతోంది. ​జాతీయ బ్యాంకుల విలీనాలకు వ్యతిరేకంగా ​బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ బ్యాంక్ ఉద్యోగుల సమాఖ్యలు బంద్ లో పాల్గొంటున్నాయి. ​​ఇటీవల ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగు బ్యాంకులుగా విలీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వ చర్యను నిరసిస్తూన్నామని బ్యాంకు ఉద్యోగుల సమాఖ్యలు చెబుతున్నాయి. ​అందులో భాగంగానే అక్టోబర్ 22 న దేశ వ్యాప్తంగా ఒక్క రోజు బ్యాంక్ ల సమ్మెను చేపడుతున్నామని అంటున్నాయి.  ​పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల విలీనం కేంద్ర ప్రభుత్వం దారుణమైన చర్యగా అభివర్ణించాయి. ​10 బ్యాంకులు 4 బ్యాంకులు గా విలీనమై పోతే ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 27 నుంచి 12 కు తగ్గిపోతుందని ఆవేదన చెందుతున్నాయి. ​ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాను తగ్గించడం విలినాలతో బ్యాంకుల ప్రేవేటీ కరణకు దారితీస్తుందని ఆరోపిస్తున్నాయి. ​కేంద్ర ప్రభుత్వ చర్య తో గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ కుప్ప కులుతుందని తెలియజేశాయి. ​బ్యాంకుల విలీనం తో ఉద్యోగులు తగ్గిపోతారు దీంతో నిరుద్యోగ సమస్య పెరిగి పోతుందని చెబుతున్నాయి. ​కేంద్రప్రభుత్వం బ్యాంకుల సంస్కరణల పేరిట కార్పొరేట్ లకు దగ్గరవుతుందని అంటున్నాయి.

BANKERS ALL INDIA STRIKE

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article