ఈఎంఐలపై కస్టమర్లకు గుడ్ న్యూస్

177
BANKS GOOD NEWS TO LOAN PAYERS
BANKS GOOD NEWS TO LOAN PAYERS

BANKS GOOD NEWS TO LOAN PAYERS

కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో ఈఎంఐలను మూడు నెలల పాటు చెల్లించనక్కరలేదని, రుణాలపై మూడు నెలల మారటోరియం విధిస్తున్నట్లు ఆర్బీఐ తాజాగా స్పష్టం చేసింది . ఈ నిబంధన అటు కమర్షియల్, రీజనల్, రూరల్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు వర్తిస్తుంది. ఇది మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగించే అంశమే అయినా ఇంకా వారిలో అయోమయం నెలకొంది. కొంతమందికి ఇంకా గందరగోళం నెలకొంది. మీ ఖాతాలనుంచి ఈఎంఐలు డెబిట్ అవుతాయని, బ్యాంకుల్లో బ్యాలెన్స్ ఉంచాలని మెసేజ్‌లు రావడమే అందుకు కారణం. అయితే తాజాగా పలు బ్యాంకులు ఖాతాదారులకు ట్వీట్ల ద్వారా గుడ్ న్యూస్ అందించాయి. ఆర్బీఐ అన్ని లోన్ల ఈఎంఐలపై మూడు నెలల పాటు మారిటోరియం విధిస్తు తీసుకున్న నిర్ణయాన్ని తమ కస్టమర్లకు బదలాయిస్తూ ఇప్పటివరకు పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ అఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఓబీసీ, సెంట్రల్ బ్యాంక్ అఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ అఫ్ ఇండియా, బ్యాంక్ అఫ్ ఇండియా, ఐఓబీ, ఐడీబీఐ, యుసీఓ, ఇండియన్, సిండికేట్, ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకులు నిర్ణయం తీసుకున్నాయి. దీనితో మార్చి 1 నుంచి మే 31 వరకూ అన్ని లోన్ల ఈఎంఐ చెల్లింపులపై కస్టమర్లకు వెసులుబాటు దక్కనుందని ప్రకటించాయి.

Tags: RBI, Corona Virus, Corona Effect, Banks EMI Moratorium, Depositors

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here