ప్రముఖ దర్శకుడు విజయ బాపినీడు కన్నుమూత

BAPINEEDU NO MORE

ప్రముఖ దర్శక నిర్మాత విజయ బాపినీడు(86) అనారోగ్యంతో కన్నుమూశారు. మంగళవారం ఉదయం హైదరాబాద్ లోని ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. మెగాస్టార్‌ చిరంజీవి, శోభన్‌ బాబులతో  పలు విజయవంతమైన సినిమాలను ఆయన నిర్మించారు. విజయ బాపినీడు 1936 సెప్టెంబర్ 22న ఏలూరు సమీపంలోని చాటపర్రులో జన్మించారు. ఆయన అసలు పేరు గుత్తా బాపినీడు చౌదరి. ఏలూరు సీఆర్‌ఆర్‌ కాలేజ్‌లో డిగ్రీ పూర్తిచేసిన ఆయన.. జర్నలిస్ట్ గా కెరీర్‌ ప్రారంభించారు. అయితే, సినిమా రంగం మీద మక్కువతో రచయితగా దర్శకుడిగా మారారు. అనంతరం నిర్మాతగానూ విజయం సాధించారు. తెలుగులో 1982లో ‘డబ్బు డబ్బు డబ్బు’ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన విజయ బాపినీడు.. మగ మహారాజు, మహానగరంలో మాయగాడు, హీరో, మగధీరుడు  వంటి వరుస విజయాలతో కమర్షియల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. చిరంజీవి కెరీర్ లో బ్లాక్ బస్టర్ సినిమా ఖైదీ నెంబర్ 786, గ్యాంగ్ లీడర్ సినిమాలు కూడా బాపినీడు తెరకెక్కించినవే. తెలుగులో 22 చిత్రాలకు దర్శకత్వం వహించిన విజయ బాపినీడు.. 1998లో ‘కొడుకులు’ చిత్రానికి చివరిసారి దర్వకత్వం వహించారు. మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150తో రీఎంట్రీ ఇచ్చిన తర్వాత.. ఆయన్ను మరోసారి డైరెక్ట్ చేయాలని ఉందంటూ బాపినీడు తన మనసులోకి కోరిక బయటపెట్టారు. అయితే, అది నెరవేరకుండానే కన్నుమూశారు. ఆయన మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.

TELUGU CINEMA

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article