కొనసాగుతున్న భారత్ బంద్

Barath bundh

· నిరసనలు తెలుపుతున్న కార్మికులు

· రవాణా రంగంపై తీవ్ర ప్రభావం

కేంద్రం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాలు చేపట్టిన భారత్ బంద్ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. సెంట్రల్‌ ట్రేడ్‌ యూనియన్‌ బిల్లు 2018కు వ్యతిరేకంగా సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు జనవరి 8, 9న భారత్ బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అన్ని రాష్ట్రాల్లోనూ కార్మికులు తెల్లవారుజాము నుంచే రోడ్లమీదకు వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. బ్యాంకు ఉద్యోగులు కూడా ఇందులో పాల్గొనాలని నిర్ణయించుకోవడంతో పలు బ్యాంకులు పనిచేయడంలేదు. బంద్ కారణంగా దేశవ్యాప్తంగా పలు చోట్ల జనజీవనం స్తంభించింది. ఒడిశాలో కార్మికులు రోడ్లపైకి చేరి ఆందోళన చేపట్టారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రవాణా రంగంపై బంద్ ప్రభావం తీవ్రంగా కనిపించింది. మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ సహా పలు చోట్ల బస్సులు తిరగలేదు. కాగా, ట్రేడ్ యూనియన్ బిల్లు 2018 సవరణ ద్వారా ప్రభుత్వం కార్మికుల హక్కులను హరిస్తోందని సీఐటీయు జాతీయ కార్యదర్శి తపన్ సేన్ గుప్తా ఆరోపించారు. కార్మికులను, ఉద్యోగులను అణిచివేసేందుకు ప్రయత్నం ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. రెండు రోజుల భారత్ బంద్‌కు 10 పెద్ద ట్రేడ్ యూనియన్లు మద్దతు ప్రకటించగా, ఆలిండియా కిసాన్ మహాసభ కూడా దీనిని స్వాగతించింది. సాధారణ ప్రజలతో పాటు ఈ ఆందోళనల్లో రైతులు కూడా పాలు పంచుకోనున్నారు. పూర్తి రుణమాఫీ, నెలకు రూ.3,500 నిరుద్యోగ భృతి చెల్లించాలని రైతులు కోరుతున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article