బార్బిక్యూ హాలిక్‌ హైద‌రాబాద్‌లో ప్రారంభం

హైద‌రాబాద్‌, జూలై 13, 2022: భార‌తీయ క్యూజిన్ల‌లో విస్తృత‌మైన రేంజి ఫ్లేవ‌ర్లతో కూడిన గ్రిల్డ్ ఫుడ్స్‌కు అత్యుత్త‌మ‌మైన బార్బిక్యూ హాలిక్‌ హైద‌రాబాద్‌లో బుధవారం ప్రారంభ‌మైంది. శేరిలింగంప‌ల్లి ఎమ్మెల్యే శ్రీ అరెక‌పూడి గాంధీ, స‌త్తుప‌ల్లి ఎమ్మెల్యే శ్రీ సండ్ర వెంక‌ట వీర‌య్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఇక్క‌డ నోట్లో నోరూరించే ర‌క‌ర‌కాల స్టార్ట‌ర్లు, రుచిక‌ర‌మైన ప్రాంతీయ వంట‌కాల‌తో మెయిన్ కోర్సు, ఎగ్జాటిక్ డెసర్టులు ఉంటాయి. నిపుణులైన షెఫ్‌ల బృందం వివిధ ప్రాంతాల‌కు చెందిన వంట‌కాల‌ను జాగ్ర‌త్త‌గా ఏర్చికూర్చి, డిజైన్డ్ డిష్‌లు తీసుకొచ్చారు. ఇవ‌న్నీ మీ నోట్లో దీర్ఘ‌కాలంపాటు రుచిని య‌థాత‌థంగా ఉంచుతాయి.150 సీట్ల‌తో అద్భుతంగా డిజైన్ చేసిన బార్బిక్యూ హాలిక్‌లో భార‌త‌దేశంలోనే ప్ర‌ధాన క్యుజిన్లు అన్నింటి నుంచి ఎంపిక చేసిన తాజా స్టార్ట‌ర్లు ఉంటాయి. విస్తారమైన మెయిన్ కోర్సుతో పాటు.. స్వ‌హ‌స్తాల‌తో రూపొందించిన మాక్‌టెయిల్స్ అన్ని వ‌య‌సుల క‌స్ట‌మ‌ర్ల మూడ్‌ను త‌ప్ప‌నిస‌రిగా మ‌ళ్లీ తీసుకొస్తాయి.

ఈ సంద‌ర్భంగా బార్బిక్యూ హాలిక్ ప్ర‌మోట‌ర్లు శ్రీ‌ల‌క్ష్మి, మౌనిక‌లు మాట్లాడుతూ, “సాద‌రంగా ఆతిథ్యమిచ్చే బార్బిక్యూ హోలిక్ అందించే సౌఖ్యం, ఆకర్షణ, రుచికరమైన వంటకాలు, సాటిలేని సేవ, అతిథుల సంరక్షణ, క‌చ్చితంగా అతిథులకు ఉత్తమ భోజన అనుభవాన్ని ఇస్తాయి. ఇక్క‌డ అత్యుత్త‌మ కబాబ్‌లే కాకుండా, అత్యంత విస్తృతమైన ప్రధాన కోర్సు, ప్రత్యేకంగా రూపొందించిన డెజర్ట్‌ల‌ను కూడా ఆస్వాదించాల‌ని మేము మా అతిథులకు చెబుతాము. బార్బిక్యూ హాలిక్‌లో , బఫే అందించ‌డం కేవలం ఒక బాధ్యత మాత్రమే కాదు, ఈ అనుభవం అత్యున్నత నాణ్యతా ప్రమాణాలను అందిస్తుంది” అని చెప్పారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article