ఎమ్మెల్సీ కవితకు ప్రతిష్టాత్మక ఆహ్వానం

ఎమ్మెల్సీ కవితకు ప్రతిష్టాత్మక ఆహ్వానం

ఆస్ట్రేలియన్ పార్లమెంటు లో జరిగే బతుకమ్మ వేడుకలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల ‌కవితకు ఆహ్వానం

ఈ నెల 25న అస్ట్రేలియాలో FINACT అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్త చేసి, బతుకమ్మ ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన ఎమ్మెల్సీ కవిత గారికి మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం అందింది. సెప్టెంబర్ 25 న ఆస్ట్రేలియాలో జరగనున్న బతుకమ్మ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఆహ్వానం అందింది. ఫెడరేషన్ ఆఫ్ ద ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఆక్ట్ (FINACT) అధ్వర్యంలో తొలిసారిగా ఆస్ట్రేలియన్ పార్లమెంటు హౌస్‌లో బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నారు. ఇందులో పాల్గొనాల్సిందిగా ఎమ్మెల్సీ కవితను FINACT అధ్యక్షులు డా.శాంతిరెడ్డి ఆహ్వానించారు. ఈ బతుకమ్మ వేడుకల్లో పలువురు ఆస్ట్రేలియా ఎంపీలు కూడా పాల్గొననున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article