భట్టీ, శ్రీధర్ బాబు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునేదెప్పుడు?

Batti and Sridhar Babu May Join Trs?

తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత కాంగ్రెస్  కే దక్కుతుంది.  కాకపోతే, ఆ క్రెడిట్ ను పూర్తిగా టీఆర్ఎస్ కొట్టేసింది. దీంతో ఏం చేయాలో అర్థం కాక కాంగ్రెస్ తలపట్టుకుంటుంది. ఈ లోపు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ దినదినాభివ్రుద్ధి చెందుతూ తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. తెలంగాణ కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీ మధ్య గల తేడా ఏమిటంటే.. టీఆర్ఎస్ పార్టీలో సీఎం కేసీఆర్ మాటే వేదవాక్కు. ఆయన గీసిన గీతను దాటడానికి ఎవరూ సాహసించరు. అంత ధైర్యం కూడా చేయలేరు. కేసీఆర్ పార్టీని అలా తీర్చిదిద్దుకున్నారు. కానీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అలా కాదు. అందులో ప్రజాస్వామ్యం ఎక్కువ. అదే వారి కొంప ముంచుతోంది. పార్టీని సరిగ్గా లీడ్ చేసే నాయకుడెవరూ లేరా పార్టీలో. పైగా తెలంగాణ అసెంబ్లీ అధికార పార్టీ కార్యకలాపాల్ని ప్రణాళికాబద్ధంగా ఎండగడుతున్నట్లుగా కనిపించడం లేదు. తామేం చేయలేమనే నిస్తేజంలో ఆ పార్టీ ఉన్నట్లుగా కనిపిస్తోంది. భట్టి, శ్రీధర్ బాబు, సీతక్కలు కాస్త ఫర్వాలేదనిపిస్తున్నా.. కేసీఆర్, హరీష్, కేటీఆర్ లను ఢీకొట్టడమంటే ఆషామాషీ విషయమేం కాదు. ఆతర్వాతి నాయకులూ టీఆర్ఎస్లో చాలా స్ట్రాంగ్గానే ఉన్నారు. కాబట్టి, ఈసారి కాదు.. కనీసం వచ్చే పది, పదిహేనేండ్లయినా టీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టే సత్తా కాంగ్రెస్కు లేనే లేదని స్పష్టమవుతోంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉనికి నిలుపుకోవచ్చు. లేదంటే భట్టీ, శ్రీధర్ బాబు వంటి వారు విధి లేక టీఆర్ఎస్లో చేరిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే, అటు కేంద్రంలో కాంగ్రెస్ వీక్ గా ఉంది. అక్కడ అధికారంలోకి వస్తే.. రాష్ట్రంలో కాస్త ఊపుండేది. దాన్ని అడ్డంపెట్టుకుని ఇక్కడి స్థానిక నాయకులు రాజ్యమేలేవారు. కానీ, ఇప్పుడా పరిస్థితుల్లేవు. భవిష్యత్తులో వస్తుందనే నమ్మకం లేదు. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ ప్రారంభం నుంచి పాతుకుపోయిన భట్టి, శ్రీధర్ బాబు వంటి నాయకులు గత్యంతరం లేని పరిస్థితుల్లో.. టీఆర్ఎస్లో చేరినా ఆశ్చర్యపడక్కర్లేదని శాసనసభ వ్యవహరాలను చూస్తున్న ప్రజలు అనుకుంటున్నారు.

telangana congress news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *