సీఎల్పీ నేతగా మల్లు భట్టి విక్రమార్క

Batti Vikramarka Once Again CLP leader

తెలంగాణ సీఎల్పీ నేతగా మల్లుభట్టి విక్రమార్క ఎన్నికయ్యారు. ఆయన పేరును ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. ఈమేరకు ఓ లేఖను విడుదల చేసింది. భట్టి విక్రమార్కకే రాహుల్ గాంధీ అవకాశం ఇచ్చారు. నలుగురు పోటీలో ఉన్నప్పటికీ భట్టి విక్రమార్క వైపు అధిష్టానం మొగ్గచూపింది. ఆయన నియామకంపై అనేక సమీకరణలున్నాయని తెలుస్తోంది. దళిత సమాజిక వర్గానికి చెందిన వాడు. గతంలో జరిగిన అసెంబ్లీలో ఆయన పర్ఫార్మెన్స్ బాగా ఉందనే అభిప్రాయానికి అధిష్టానం వచ్చింది. అందుకే ఆయనను సీఎల్పీ నేతగా ఎంపిక చేసింది.
గత మూడ్రోజులుగా సీఎల్పీ నేతగా ఎవర్ని ప్రకటించాలనే విషయంపై అధిష్టానం కాంగ్రెస్ నేతలు చర్చించారు. సీఎల్పీ రేసులో మొదట్నించి భట్టీతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు పేర్లు వినిపించాయి. అధిష్టానం దూతగా వచ్చిన ఏఐసీసీ పరిశీలకుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేతో సమావేశమై అభిప్రాయాలు సేకరించారు. ఇక నిర్ణయాన్ని రాహుల్ గాంధీకి అప్పగిస్తూ ఏకవాక్య తీర్మానం చేసి అధిష్టానానికి సమర్పించారు. మల్లు భట్టి విక్రమార్క పేరును ఫైనల్ చేశారు రాహుల్ గాంధీ. భట్టి పేరు ఫైనల్ చెయ్యటంతో సీఎల్పీ రేసులో ఉన్న మిగతావారు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఒక పక్క ఆయనను సీఎల్పీ నేతగా ప్రకటించటంతో మధిరలోని పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి.
మధిర నుంచి భట్టి విక్రమార్క టీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్‌రాజ్‌‌పై పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వరుసగా మూడు సార్లు మధిర నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గతంలో ఎమ్మెల్సీగా పని చేశారు. మొత్తం నాలుగు టర్మ్ లుగా సభా వ్యవహారాలపై ఆయనకు అనుభవం ఉంది. అనుభవం, పని తీరు ఆధారంగా భట్టికి సీఎల్పీ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఆయన పార్టీ చీఫ్ విప్ గా పని చేశారు. ఉమ్మడి ఏపీలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా కొనసాగారు. భట్టి విక్రమార్క సీఎల్సీ నేతగా అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నారు. రేపు జరుగనున్న బీఏసీ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article