Saturday, April 5, 2025

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు బాగుండాలి

  • శ్రీశైలం భ్రమరాంబ మల్లిఖార్జున స్వామిని వేడుకున్నా…
  • రెండు తెలుగు రాష్ట్రాల సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుంటాం
  • బిసి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామిని బిసి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. సోమవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి ఆయన స్వామి వారిని దర్శించుకోగా, ఆలయ అధికారులు మంత్రి పొన్నంకు ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం మంత్రి మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు బాగుండాలని శ్రీశైలం భ్రమరాంబ మల్లిఖార్జున స్వామిని, అమ్మవార్లను వేడుకున్నట్టు ఆయన తెలిపారు.

రాత్రి 10 గంటలకు శ్రీశైలం నుంచి ఒక ఎసి బస్సు,హైదరాబాద్ నుంచి శ్రీశైలం కు ఒక ఎసి బస్సు తిరిగేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం తెలిపారు. తెలంగాణలోని ప్రతి మండలం నుంచి జిల్లా హెడ్ క్వార్టర్‌కు ఒక ఎసి బస్సు ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లా హెడ్ క్వాటర్ నుంచి హైదరాబాద్‌కు ఒక ఎసి బస్సు నడుపుతామని, అవసరం అయితే మండల కేంద్రం నుంచి స్థానికుల అవసరాల మేరకు హైదరాబాద్‌కు ఎసి బస్సు ఏర్పాటు చేస్తామన్నారు.

తాము ఎన్నికల ముందు చెప్పినట్టుగా రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, రాష్ట్రం నుంచి ఇద్దరు బిజెపి కేంద్ర మంత్రులు ఉన్నారని, కేంద్రం నుంచి నిధులు వచ్చేలా వారిపై ఒత్తిడి తెస్తామని, రెండు తెలుగు రాష్ట్రాల సమస్యలు సామరస్యంగా పరిష్కారం చేసుకుంటామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన పూజలను మంత్రి పొన్నం చేశారు.

సోమవారం నుంచి శ్రావణ మాసం ప్రారంభం కావడంతో శ్రీశైలం ఆలయానికి పోటెత్తారు భక్తులు..శ్రీశైలం ఘాట్ రోడ్లన్నీ ట్రాఫిక్ జాం అయ్యాయి. సోమవారం ఉదయం నుంచే భక్తులు క్యూలైన్‌లో నిలుచున్నారు. ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. స్వామి వారి దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com