గోవా వెళ్తున్నారా.. జర జాగ్రత్త

BEWARE IN VISITING GOA

గోవా ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నారా? ఈ వేసవికి సరదాగా గోవా వెళ్లి.. బీచ్ లో కూర్చుని బీరేద్దామని భావిస్తున్నారా? అయితే, మీరు ఇది  చదవాల్సిందే. ఇకపై గోవా బీచ్ లో ఎక్కడ పడితే అక్కడ మందు తాగడం కుదరదు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో వంట చేయడం కూడా నిషిద్ధమే. ఈ మేరకు పర్యాటక చట్టంలో మార్పులు తీసుకువాలని గోవా సర్కారు నిర్ణయం తీసుకుంది. బీచ్ లో బీరు తాగినా, బహిరంగ ప్రదేశాల్లో వంట చేసినా రూ.2వేల జరిమానా లేక మూడు నెలలు జైలు శిక్ష విధించనున్నారు. గోవాలో కాలుష్యాన్ని నివారించేందుకు వీలుగా బీచ్ లో మద్యం తాగినా, వంట చేసినా రెండువేల రూపాయలు జరిమానా విధించాలని గోవా మంత్రివర్గ సమావేశం తీర్మానించిందని ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అజ్ గోంకర్ వెల్లడించారు. జరిమానా చెల్లించకపోతే మూడు నెలల జైలు శిక్ష విధిస్తామని మంత్రి పేర్కొన్నారు. అంతేకాకుండా పర్యాటకశాఖలో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న తర్వాతనే హోటల్‌ బుకింగ్‌ చేసుకునేలా నిబంధనను తీసుకొచ్చామని వెల్లడించారు.

NATIONAL UPDATES

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article