అలసిన వారికి ఊరడించు మాటలు

సహోదరుడు భక్త సింగ్

“అయితే – అతనికి ప్రత్యుత్తరమియ్యవద్దని రాజు సెలవిచ్చి యుండుట చేత జనులు ఎంత మాత్రమును ప్రత్యుత్తర మియ్యక ఊరకుండిరి” (2 రాజులు 18:36)

ఎఫెసీ. 4:11-14లలో ఆయన ప్రజలముగా మనము సంపూర్ణతకు వచ్చుట దేవుని యొక్క ఏర్పాటు. దేవుడు సంఘమునకు అపొస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు అను అయిదంతలు కృపావరములను ఇచ్చెను. వారి అయిదంతల పరిచర్య ద్వారా ఆత్మలు తిరిగి జన్మించి, యేసు క్రీస్తు ప్రభువు యొక్క సంపూర్ణతలోనికి తేబడుదురు. మనము దేవుని ఏర్పాటు ననుసరించి ఆయన వాక్య ప్రకారము సంఘమును కట్టుటకు ఆరంభించినప్పుడు, వెంటనే శత్రువు కూడా ఆటంక పరచెడి వాని కార్యమును ఆరంభించును. ప్రజలు దేవునికి సంపూర్ణముగా లోబడి దేవుని మందిరములో, బాప్తిస్మములో, ఆరాధన, ప్రార్ధన మరియు బైబిలు పఠనంలో భాగము తీసికొనుటకు ఆరంభించునప్పుడు సాతాను అనేక వైపులనుండి ఆటంకములు తెచ్చుటను మేము అనుభవించితిమి. కీర్తన 129:2 లో కీర్తనకారుడు చెప్పుచున్నట్లు తప్పుడు ప్రచారము చేయుట ద్వారా మన చేతులను బలహీన పరచుటకు వాడు ప్రయత్నించును మరియు దేవుని పనిని ఆటంక పరచుటకు అనేక ఇతరమైనవి చేయును. అయితే మనము కేవలము దేవుని యందు నమ్మకముంచి, వారి మాటలు లేక కార్యములను ఏ మాత్రము పట్టించు కొనకుండా ఉన్న యెడల ప్రభువు మన పక్షముగా పనిచేసి వారిని అవమానపరచును. అనేక సార్లు కొందరు వ్యతిరేకముగా నీ పైకి వచ్చి, నీకు వ్యతిరేకముగా మాటలాడి , హాని చేయుటకు ప్రయత్నించుదురు. అటువంటి సమయములలో ఏ మాత్ర్రము వారి మాటలను పట్టించు కొనకుము లేక ఏ విధానంలోను వారి పై పగ తీర్చుకొనుటకు ప్రయత్నించకుము. ఎవరు చంద్రునిపై ఉమ్మివేయుటకు ప్రయత్నించుదురో వారిపైనే ఉమ్మి పడుననిమనము జ్ఞాపకము చేసి కొనుటకు ఇది సహాయపడును. మన శత్రువులు మనకు హాని చేయుటకు ఏదైనా చేయ వచ్చును. అయితే ఉపాయముగా వారు చేయు కీడు తిరిగి వారి మీదికే వెళ్ళును. కీర్తన 129:5 లో మనకొక వాగ్దానము గలదు. “సీయోను పగవారందరు సిగ్గుపడి వెనుకకు త్రిప్పబడుదురు గాక” వారు నింద, శిక్షావిధి క్రిందికి వచ్చెదరు. వారి వ్యతిరేకతను బట్టి నీవు చింతపడ నారంభించిన యెడల నీ నిద్రను, ఆకలిని, సమాధానమును పోగొట్టుకొందురు. దానికి బదులుగా నీవు వారికి వారిని విడిచిపెట్టి దేవుని దయయందు ఆనందించుము.

శత్రువు దేవుని మందిరంగా సీయోనును ద్వేషించును, నీవు దేవుని ఏర్పాటు చొప్పున దేవుని మందిరములో ఉండవలెనని కోరుచున్నయెడల, వాడు నిన్ను ద్వేషించుటకు మరియు బయలు పరచబడిన దేవుని సత్యమునకు సంపూర్ణముగా లోబడకుండా ఆటంక పరచుటకు మనుష్యులను లేపును. నీవు దేవుని వాక్యమునకు సంపూర్ణముగా లోబడి ఆయన పరలోక సంకల్పము ననుసరించి ఆయన చిత్తము చేయవలెనని కోరినప్పుడు నీవు హేళన పాలగుదువు, ద్వేషించ బడుదువు మరియు తృణీకరించ బడుదువు. అయితే నీవు కీర్తన 129:6 లోనున్న ఆయన వాగ్దానములను అనుభవించుదువు, “వారు ఇంటిమీద పెరుగు గడ్డివలె నుందురు గాక ఎదుగక మునుపే అది వాడిపోవును”. అది ఎవరైనను ఇంటిపై కప్పు మీదికి ఎక్కి దానిని శుభ్ర పరచుటకు తమ సమయమును, శక్తిని వ్యర్ధము చేసికొనుటవలె నుండును. మన శత్రువులు కూడా ఆలాగుననే వాడిపోవుదురని ప్రభువు చెప్పుచున్నాడు. వారి విషయమై మనము చింతించ వలసిన అవసరము లేదు, లేక వారిని ఎదిరించ వలెనని ప్రయత్నించ నవసరము కూడా లేదు. మనము ఓపికతో నున్న యెడల ప్రభువే వారిని సంధించుటను మనము చూడగలము.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article