యువమోర్చా అందోళన

హైదరాబాద్ : విద్యార్థుల, యువకుల సమస్యలు పట్టించుకునే నాధుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఎవరూ లేరని వినతి పత్రం తీసుకోవడానికి కూడా ఎవరూ లేకపోవడం బాధాకరమని భారతీయ జనతా యువ మోర్చా(BJYM) ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ నియామకాల్లో విద్యార్థుల వయోపరిమితి రెండు సంవత్సరాలు పెంచాలని, దరఖాస్తు గడువు పదిహేను రోజులు పొడిగించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ముందు యువమోర్చా నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. గ్రూప్-1 పరీక్షలను గత తొమ్మిది సంవత్సరాల నుంచి ప్రభుత్వ నిర్వహించలేదని గ్రూప్-1 నోటిఫికేషన్ ను వెంటనే విడుదల చేసి…. పరీక్షలను నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. గ్రూప్-1 పరీక్షలలో ఉర్దూ భాష తొలగించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఉర్దూ భాష ఉండడం వల్ల అనేకమంది విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు, యువకులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article