అత్యాచారాలకు అదే కారణమా?

Bhatti Vikramarka Comments On Telangana Liquor

రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుంది. మద్యం విక్రయాలు విపరీతంగాపెరగటమే నేరాలకు కారణమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. మహిళలపై దాడులు, మద్య నియంత్రణపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించాలని కోరారు. లేదంటే రాష్ట్రంలో మరిన్ని దిశ లాంటి ఘటనలు జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు.ప్రభుత్వం ఆదాయం పెంచుకునేందుకు యువతను పెడదోవ పట్టిస్తోందని విమర్శించారు. పోలీసు వ్యవస్థ టీఆర్ఎస్ నాయకుల కబంధహస్తాల్లో చిక్కుకుపోయిందని మండిపడ్డారు. శనివారం కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి గవర్నర్ తమిళి సై సౌందర రాజన్‌కు మహిళలపై దాడి, మద్య నియంత్రణపై ఫిర్యాదు చేశారు.మద్యంపై ఆదాయాన్ని పెంచుకోవడం కోసం ప్రభుత్వం చూస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం ప్రజల బాగోగులు పట్టించుకోవడం లేదన్నారు. వ్యాపారాత్మక ధోరణితోనే ప్రవర్తిస్తుందని చెప్పారు.  దీంతో యువత మత్తులో జోగుతుందని.. ఆయా కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా చితికిపోతున్నాయని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా బెల్ట్: షాపులను ఎత్తివేయాలని భట్టి విక్రమార్క గవర్నర్‌ను కోరారు. అలాగే రహదారులపై ఉన్న మద్యం షాపులను మూసివేయాలని స్పష్టంచేశారు. లేదంటే మద్యం సేవించి, మత్తులో ఏం చేస్తున్నామో తెలియకుండా కొందరు రెచ్చిపోయే ప్రమాదం ఉందన్నారు.ప్రజల ధన, మాన ప్రాణాలను సంరక్షించాల్సిన పోలీసు వ్యవస్థ టీఆర్ఎస్ నేతల కబందహస్తాల్లో చిక్కుకుపోయిందని ఆరోపించారు. పోలీసులను తమ సొంత పనులకు నేతలు వాడుకుంటున్నారని చెప్పారు. దీంతో పోలీసులు కూడా స్వేచ్చగా పనిచేసే వీలులేదని ఆరోపించారు. హత్యలు, లైంగికదాడులు జరిగి.. రాష్ట్రంలో క్రైం రేటు పెరిగిపోతుందని చెప్పారు. దిశ కనిపించట్లేదని పేరెంట్స్ చెబితే తమ పరిధిలోకి రాదని వారు చెప్పడం సరికాదని ఖండించారు.రాష్ట్రంలో జరిగే అరాచకాలను అరికట్టాలని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.

Bhatti Vikramarka Comments On Telangana Liquor,#MalluBhattiVikramarka,LiquorSales,CrimeRate ,#Governor,#TamilisaiSoundaraRajan

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article