మున్నూరు కాపు ఆత్మగౌరవ భవనానికి భూమి పూజ

  • సంఘటితంగా మున్నూరు కాపులు

*రాష్ట్రంలో ప్రభల శక్తిగా మంత్రి గంగుల కమలాకర్ సారథ్యంలో ఎదుగుతున్న మున్నూరు కాపులు

*జూన్ 9న హైదరాబాద్ లోని కోకాపేటలో మున్నూరు కాపు ఆత్మగౌరవ భవనానికి భూమి పూజ

*రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్నూరు కాపులు తరలిరావాలని పిలుపు

తెలంగాణలోని మున్నూరు కాపు సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి, ఈ నెల 9న ఉదయం 7 40 నిమిషాలకు హైదరాబాదులోని కోకాపేటలో మున్నూరు కాపు ఆత్మగౌరవ భవన నిర్మాణ పూజ నిర్వహించనున్నాయి. విద్య, వైద్యం, వ్యాపార తదితర రంగాల్లో మున్నూరు కాపుల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ సారథ్యంలో ప్రభల శక్తిగా ఎదుగుతున్నాయి. నేడు హైదరాబాద్లోని మంత్రి గంగుల నివాసంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిద మున్నూరు కాపు సంఘాలు సమావేశమై ఆత్మగౌరవ భవన నిర్మాణం, ఏకసంఘంగా ఏర్పడే ట్రస్ట్ విధి విధానాలు, భవిష్యత్తులో మున్నూరు కాపుల సంక్షేమం కోసం తీసుకోబోయే చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల ఐక్యంగా ఉండాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఈ నెల 9న ఉదయం మున్నూరు కాపు ఆత్మగౌరవ భవనం భూమి పూజా కార్యక్రమాలతో పాటు రాష్ట్రంలోని మున్నూరు కాపు సోదరులందరూ హాజరయ్యే విధంగా సభ సమావేశం నిర్వహిస్తామన్నారు, ఈ కార్యక్రమానికి మున్నూరు కాపు సంఘాలకు చెందిన జిల్లా అధ్యక్షులు, జిల్లాల కమిటీలు, మండలాల అధ్యక్షులు, మండల కమిటీలు, గ్రామ స్థాయి అధ్యక్షులు, అన్ని గ్రామాల కమిటీలు, నియోజకవర్గాల కోఆర్డినేషన్ కమిటీలు ప్రతి ఒక్క మున్నూరు కాపు బిడ్డలు హాజరవ్వాలని మంత్రి గంగుల ఆహ్వానించారు, అల్పాహారం, భోజనం తో పాటు అన్ని ఏర్పాట్లను ఘనంగా చేస్తున్నామన్నారు. కులం అభివ్రుద్ది కోసం, రాబోయే భవిష్యత్ తరాలకు అన్ని విధాలుగా అండగా ఉండడం కోసం మున్నూరుకాపులంతా కలిసికట్టుగా ఉండాలన్నారు. సమాజ శ్రేయస్సును కోరే మున్నూరు కాపుల సంక్షేమానికి, అభివృద్ధికి కట్టుబడి ఉంటామన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మేహన్, కాచిగూడ మున్నూరు కాపు మహాసభ అధ్యక్షులు మానికొండ వెంకటేశ్వరరావు నాయకులు మంగళారపు లక్ష్మణ్, కొండూరి వినోద్, సునీల్ కుమార్, రాష్ట్ర మున్నూరుకాపు సంక్షేమ సంఘం తదితర సంఘాలకు చెందిన నేతలు హాజరయ్యారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article