రోడ్డు ప్రమాద బాధితురాలికి భువనగిరి ఎంపీ వైద్య సేవలు

BHUVANAGIRI MP HELPED ROAD ACCIDENT VICTIMS

ఆయనో ప్రజా ప్రతినిధి. అందులోనూ పార్లమెంట్ సభ్యుడు. తాను రోడ్డు మీద వెళ్తున్న సమయంలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఓ మహిళకు వెంటనే కారు దిగి ప్రాధమిక చికిత్స అందించిన మానవతా మూర్తి. ఆయనెవరో కాదు భువనగిరి ఎంపీ డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్‌. వివరాల్లోకి వెళితే హైదరాబాద్ మియాపూర్ కు చెందిన నాగమణి, వెంకటేశ్వర్లు, నాగరాజు కలసి ద్విచక్ర వాహనం పై వారి స్వగ్రామమైన ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం వెళ్తున్నారు. మార్గ మధ్యంలో నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం ఇనుపాములు గ్రామం వద్ద వారు ప్రయాణిస్తున్నవాహానం ఎదురుగా ఉన్న వాహానాన్ని ఢీ కొట్టడంతో ముగ్గురు కింద పడిపోయారు.
ఆ సమయంలో అదే మార్గంలో ప్రయాణిస్తున్న భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ తన కారును ఆపి పరిస్ధితి గమనించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నాగమణికి వెంటనే ప్రాధమిక చికిత్స చేశారు. అనంతరం 108 అంబులెన్స్ ను పిలిపించి ఆమెను దగ్గరుండి ఆసుపత్రికి పంపించారు. రోడ్డు మీద వెళుతుంటే ఏదైనా ప్రమాదం జరిగితే మన కెందుకులే అని పక్కనుంచి వెళ్లి పోయే మనుషుళ్ళన్న ఈ రోజుల్లో ఒక ప్రజాప్రతినిధి జరిగిన ప్రమాదానికి స్పందించి వెంటనే చికిత్స అందిచటంతో స్ధానికులు ఎంపీ పై ప్రశంసల జల్లు కురిపించారు. అందరూ ప్రజాప్రతినిధులు మనుషుల పట్ల ఇదే మానవీయ దృక్పథం అలవర్చుకుంటే బాగుంటుందని ఘటనా స్థలంలో చర్చ జరిగింది. మొత్తానికి నరసయ్య గౌడ్ ఎంపీగా ప్రజా సేవ చేయడమే కాదు డాక్టర్ గా తన వృత్తి ధర్మాన్ని సైతం నిర్వర్తించి అందరి మన్ననలు పొందాడు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article